కారుపై జగన్.. అదే కారు చక్రాల కింద నలిగిన సింగయ్య (వీడియో)

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల(Rentapalla)లో పర్యటించిన విషయం తెలిసిందే.


ఈ పర్యటనలో ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్‌(Jagan convoy)లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణించిన వాహనమేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజులతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో పోలీసులకు కీలక ఆధారాలు చిక్కాయి. జగన్ ప్రయాణిస్తున్న కారు (Jagan’s car) చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగి పోయినట్లు చూపించే వీడియో ఆధారాలను (Video evidence) పోలీసులు చేదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారుపై జగన్ తన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా.. ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా కనిపించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న నెటిజన్లు.. సింగయ్య మృతికి కారణమైన జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తన కాన్వాయ్‌ ఢీకొని పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం సంతాపం కూడా తెలపకపోవడం తో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.