ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. నేడు కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. అమరావతి వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో గత ఏడాది పాలనలో సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. రాబోయే నాలుగేళ్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించనున్నారు.


కాగా ఈ సమావేశం జూన్ 12న జరగాల్సి ఉండగా, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేసింది. ఇప్పుడు జూన్ 23న సాయంత్రం 4 గంటలకు అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమావేశం జరుగుతుంది. ఈ భేటీకి రాష్ట్రంలోని అన్ని 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్‌వోడీలు, శాఖల సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. పాలనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలపై ప్రభుత్వం ఎలా స్పందించిందన్నది చర్చించనున్నారు.

భేటీలో చర్చకు రానున్న కీలక అంశాలు.. పోలవరం ప్రాజెక్టు పురోగతి అమరావతి రాజధాని నిర్మాణం

పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షణ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సుపరిపాలనకు తీసుకున్న చర్యలు

డిజిటల్ పాలన, అవినీతి రహిత పరిపాలన సహా పలు అంశాలు అంతే కుండా వేదికపై వివిధ శాఖల పనితీరును సీఎం సమీక్షించనున్నారు. మంత్రులు తమ శాఖల ప్రగతి నివేదికలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి ప్రశ్నలు అడిగి, ప్రజల ముందే వారి బాధ్యతను గుర్తుచేయనున్నారు. ఇది పరిపాలనా పద్ధతిలో పారదర్శకతను పెంచే ప్రయత్నంగా భావించబడుతోంది. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి.. ఈ సమావేశం ద్వారా వచ్చే నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోబోయే దిశలు, ప్రణాళికలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యాల మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేందుకు మార్గదర్శకాలను రూపొందించనున్నారు.

అధికారులతో డిన్నర్.. సమావేశం ముగిశాక, సీఎం చంద్రబాబు అధికారులతో ప్రత్యేకంగా డిన్నర్ నిర్వహించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.