జగన్‌ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ కీలక రిపోర్టు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan mohan Reddy) ఎలాంటి ప్రాణహాని, ముప్పు లేదని కేంద్ర ఇంలిటిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది.


ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నివేదించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సెక్యురిటీ కల్పించాలని పిటిషన్‌లో జగన్ కోరారు.

ఏపీ హైకోర్టులో ఈ రోజు(మంగళవారం) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.