‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం : వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో “రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో”(Recalling Chandrababu’s Manifesto) పేరిట ఒక వినూత్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి 5 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ పథకాల అమలు విఫలమైందని ప్రజలకు తెలియజేయడమే దీని లక్ష్యం అన్నారు. YSRCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమంలో QR కోడ్ స్కాన్ విధానాన్ని ఉపయోగిస్తామని, ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి, ఒక బటన్ నొక్కితే చంద్రబాబు నాయడు మేనిఫెస్టో వివరాలు, మరో బటన్ నొక్కితే కూటమి వాగ్దానాలు నెరవేరకపోవడం వల్ల ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో లెక్కలు, వివరాలు చూపిస్తాయని జగన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్‌ హామీలో భాగంగా.. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు రూ.3,000-6,000 భృతి, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.20,000 సాయం, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం కింద రూ.15,000 వంటి వాగ్దానాలు అమలు కాలేదని, ఈ వైఫల్యం వల్ల ప్రతి కుటుంబం సగటున రూ.1-2 లక్షల నష్టపోయిందని జగన్ ఆరోపించారు. ఈ ప్రచారంలో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, ఈ నష్టాన్ని వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.