అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్

తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయోపరిమితిని పెంచింది. అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి వయస్సును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత పదోన్నతి కోసం అవకాశాలు లేకపోయినా.. వారికి కూడా మళ్లీ ఇప్పడు అవకాశం లభించనుంది.

అంగన్వాడీ హెల్పర్ల పదోన్నతి కోసం గరిష్ట వయోపరిమితిని పెంచాలని యూనియన్ల నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు రావడంతో సాధ్యాసాధాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ క్రమంలో అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు అంగన్వాడీ హెల్పర్లకు టీచర్ ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ క్రమంలవో మంత్రి సీతక్క సంబంధిత ఫైల్ పై సంతకం చేయగా.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.