అర్జెంటుగా డబ్బులు కావాలా?.. నేరుగా అకౌంట్ లోకి రూ. 10 వేలు.. ఎలా అంటే?

చాలా మందికి తెలియని ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. వీటి ద్వారా అనేక విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అర్జెంటుగా డబ్బులు అవసరం పడితే సమయానికి ఇచ్చే వాళ్లు ఉండరు.


ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ వసూల్ చేస్తుంటారు. ఇలా కాకుండా ఈజీగా లోన్ పొందే సౌకర్యం ఉంది. నేరుగా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. రూ. 10 వేలు పొందొచ్చు. అసలు ఆ పథకం ఏంటి? డబ్బులు ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారా? అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆ పథకం పేరు ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. దీనిని PMJDY అని కూడా అంటారు. ముందుగా, ఈ పథకం కింద ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ పథకం గురించిన ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ప్రయోజనాలను పొందడానికి ఎటువంటి పరిమితి లేదు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం లక్ష్యం ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా కల్పించడం. తద్వారా వారు ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. డబ్బు చేరుకోవడంలో ఎటువంటి సమస్య ఉండకూడదు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతా తెరవడానికి మీరు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీని కింద, ప్రతి వ్యక్తికి రూపే డెబిట్ కార్డ్ ఇస్తారు. ఈ కార్డు ద్వారా, ప్రతి లబ్ధిదారుడు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందుతాడు. అంటే ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే లేదా గాయపడితే, అతను రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

దీనితో పాటు, మీరు ఈ కార్డును సాధారణ డెబిట్ కార్డు లాగా కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా, మీరు నెలకు నాలుగు సార్లు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. మీ బ్యాంకులో డబ్బు ఉన్నా లేకపోయినా , ఈ పథకం కింద మీరు రూ. 10,000 రుణం తీసుకోవచ్చు. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, మీకు మరో రూ. 10,000 రుణం లభిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ప్రాసెసింగ్ ఫీజు లేదు. మీరు సాధారణ బ్యాంకు ఖాతాలో పొందే వడ్డీనే దీనిపై కూడా పొందుతారు. మీ బ్యాంక్ శాఖకు వెళ్లి అవసరమైన పత్రాలను అందించి ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతా ఓపెన్ చేయొచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.