మెత్తని, స్పాంజీ వంటి ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఓట్స్నో ఓ పాన్‌లో వేయించాలి. ఇలా చేస్తే వాటి రుచి, సువాసన పెరుగుతుంది. తరువాత ఓట్స్‌ను మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఓ పాన్‌లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి కాస్త చిటపటలాడిన తర్వాత అల్లం, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. తరువాత రవ్వ వేసి, అది కొంచెం రంగు మారే వరకు, వాసన వచ్చే వరకు వేచించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి.
వేయించిన ఓట్స్ పౌడర్‌ను సూజీలో వేసి.. చల్లారనివ్వాలి. తర్వాత పెరుగు, నీరు, ఉప్పు, తరిగిన కూరగాయలు వేసి చిక్కటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దానిలో మీకు నచ్చిన కూరగాయలను వేసుకోవచ్చు. క్యారెట్లు, క్యాప్సికమ్ లేదా బీన్స్ వంటివి రుచిని మరింత పెంచుతాయి.
వీటన్నింటి తరువాత పిండిలో బేకింగ్ సోడా వేసి కలపండి. దీనివల్ల పిండి పొంగుతుంది. అంతేకాకుండా ఇడ్లీలు మెత్తగా, స్పాంజిలా తయారవుతాయి. ఇప్పుడు పిండి పూర్తిస్థాయిలు ఇడ్లీ వేసుకునేందుకు రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఇడ్లీ పాత్రలలో పిండి వేసి 10-12 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీలు బాగా ఉడకడానికి కొంచెం సమయం ఇవ్వాలి. అంతే టేస్టీ టేస్టీ మృదువైన, స్పాంజీ వంటి హెల్తీ ఓట్స్ ఇడ్లీ రెడీ.
వీటిని మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు. ఈ అల్పాహారం రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఓట్స్ ఇడ్లీలో ఫైబర్, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
































