వాహనాలకు క్రేజీ నెంబర్ల కోసం ఎంత డబ్బు వినియోగించడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు అచ్చొచ్చిన నెంబరు కోసం తాము కొన్న వాహనం అంతైనా నెంబరు కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు.అందులో 9999 నెంబరు క్రేజీ నెంబర్.
ఈ తరహా నెంబర్లను రవాణా శాఖ వేలం వేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
నలుగురు పోటీ పడటంతో…వరంగల్ లోని ఆర్టీఏ కార్యాలయంలో 9999 నెంబరుకు అత్యధిక ధర పలికింది. ఈ నెంబరు కోసం నలుగురు పోటీ పడ్డారు. రవాణా శాఖ మాత్రం కనిష్ట ధర యాభై వేల రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ నెంబరు కోసం నలుగురు పోటీ పడగా సీక్రెట్ ఆక్షన్ నిర్వహించారు. ఇందులో హర్ష కంపెనీ టీజీ 24 ఏ 9999 నెంబరును సొంతం చేసుకుంది. ఈ నెంబరు కోసం ఆ సంస్థ 11,09,999 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
































