కేవలం 10 నిమిషాల్లో కరకరలాడే “పునుకులు” అన్నీ ఇంట్లో ఉన్నవాటితోనే

కేవలం 10 నిమిషాల్లో కరకరలాడే ‘పునుకులు’ అన్నీ ఇంట్లో ఉన్నవాటితోనే.. చాలా తక్కువ సమయంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ పునుగులను వేసుకోవచ్చు.


పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.

పునుగుల తయారీకి కావాల్సిన పదార్థాలు:
పెరుగు – 1 కప్పు
ఉప్పు – తగినంత
జీలకర్ర – అర టీస్పూన్
వంటసోడా – అర టీస్పూన్
గోధుమపిండి – 2 కప్పులు

తయారీ విధానం:
ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, జీలకర్ర, వంటసోడా వేసి బాగా కలపాలి. తర్వాత ముప్పావు కప్పు నీరు పోసి ఎక్కువ సేపు కలుపుకోవాలి.అనంతరం పెరుగు మిశ్రమంలో గోధుమపిండి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీరు జోడిస్తూ, పునుగులు వేయడానికి సరిపడే సాంద్రత ఉండేలా పిండిని తయారు చేయాలి.

పిండి సరిపడా నీరు కలిసిన తర్వాత, 5 నిమిషాల పాటు చేతితో పైకి కిందకి కొడుతూ బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పునుగులు రుచికరంగా వస్తాయి. పిండిని సరిగ్గా కలిపిన తర్వాత, మూత పెట్టి సుమారు 2 గంటల పాటు పులియబెట్టాలి. ఎక్కువ సేపు పులియబెడితే, పునుగులు మరింత రుచిగా ఉంటాయి.

రెండు గంటల తర్వాత మూత తీసి, పిండిని మరో 5 నిమిషాల పాటు బీట్ చేయాలి.స్టవ్ ఆన్ చేసి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, మంటను మీడియం స్థాయిలో ఉంచి, పిండిని తీసుకుని పునుగులుగా వేయాలి.

కడాయిలో సరిపడా పునుగులు వేసిన తర్వాత, మీడియం మంట మీద కలుపుతూ, రెండు వైపులా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించాలి.వేగిన పునుగులను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే వేసి, రెండు వైపులా కాల్చి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

ఈ విధంగా రుచికరమైన గోధుమపిండి పునుగులు సిద్ధం! ఇవి టమాటా పచ్చడితో 10 నిమిషాల్లో తయారు చేసి కాంబినేషన్గా సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.