కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అందులో శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం GOAT సేల్ జూలై 17 వరకు (Samsung Galaxy S24 FE) కొనసాగుతుంది.
ఈ షాపింగ్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ఇప్పుడు రూ. 25వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ వివరాలు ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 FE రూ.59,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.24వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతో ధర రూ.35,999కి తగ్గింది. మీరు IDFC ఫస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. ధరను మరింత తగ్గాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అడాప్టివ్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, గెలాక్సీ S24 FE ఎక్సినోస్ 2400e చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో కూడా సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 FE హ్యాండ్సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.
































