చూడడానికి ఎర్రగా, నెయ్యి వాసనతో ఉండే రామేశ్వరం దోసె అనగానే నోరూరిపోతుంది. ఈ దోసె కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరీ చూస్తుంటాం. అలాంటి దోసెలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని మీకు తెలుసా? దోసెతో పాటు పైన చల్లే గన్ పౌడర్ కూడా తయారు చేసుకుని నిల్వ పెట్టుకోవచ్చు.
- ఉడికించిన (స్టీమ్) రైస్ – 1 కప్పు
- మినపగుండ్లు – 1 కప్పు
- మెంతులు – అర టేబుల్ స్పూన్
- మందపాటి అటుకులు – ముప్పావు కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- చక్కెర – అర టేబుల్ స్పూన్
-
దోసెపై చల్లుకునే గన్ పౌడర్ కోసం :
- పావుకప్పు – పచ్చిశనగపప్పు
- అరకప్పు – మినప్పప్పు
- తెల్ల నువ్వులు – పావు కప్పు
- కశ్మీరీ చిల్లి – 12
- ఎండు మిర్చి – 3
- ఇంగువ – అర టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా రేషన్ లేదా వాడుక బియ్యం, స్టీమ్ రైస్, మినపగుండుల్ వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ మెంతులు, ముప్పావు కప్పు మందపాటి అటుకులు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని నీళ్లు వడగట్టి మరో సారి నీళ్లు పోసుకుని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- బియ్యం, మినప్పపప్పు ఒకే కొలతల్లో తీసుకోవాలి. దీని కోసం గిన్నె లేదా గ్లాస్ సెట్ చేసుకోవాలి.
- ఐదారు గంటల తర్వాత బియ్యం మినప్పప్పు మిక్సీ జార్‌లోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మృదువుగా మిక్సీ పట్టుకోవాలి. పిండి కాస్త రవ్వలాగ ఉండడం వల్ల దోసె క్రిస్పీగా వస్తుంది. ఇపుడు పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని పిండిని చేతితో బీట్ చేస్తూ కలపాలి. ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత రాత్రంతా నానబెట్టుకోవాలి.
- దోసెపై చల్లుకునే గన్ పౌడర్ కోసం మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు సన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి. ఐదారు నిమిషాల పాటు సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. పప్పులు రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- అదే కడాయిలో పావు కప్పు తెల్ల నువ్వులు వేయించుకుని తీసుకోవాలి.
- మళ్లీ అదే కడాయిలో 12 కశ్మీరీ చిల్లి, 3 గుంటూరు ఎండు మిర్చి వేసుకుని వేయించి చల్లార్చుకోవాలి.
- చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్‌లోకి ఎండు మిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత చల్లారిన మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, నువ్వులు వేసుకుని అర టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని లైట్‌గా బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న గన్ పౌడర్ చల్లారిన తర్వాత గాజు సీసాలో మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.
- ఇపుడు దోసె వేసుకోవడానికి పులిసిన పిండిని గరిటెతో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకుని కావల్సిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని దోసెలు వేసుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ చక్కెర కలపాలి. ఇలా చెక్కర వేసుకోవడం వల్ల దోసె క్రిస్పీగా, మంచి రంగులో వస్తుంది.
- దోసె పెనం పెట్టుకుని ప్యాన్ మరీ ఎక్కువ వేడిగా లేనపుడే దోసె వేసుకోవాలి. పైన కాస్త నెయ్యి వేసుకుని, గన్ పౌడర్ చల్లుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా కాల్చుకోవాలి.
































