డయాబెటిక్ ఉన్నా పర్వాలేదు.. ఈ బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు

ఉప్పు ఎక్కువ తినకూడదు. కారాన్ని మితంగా వాడాలి. తీపి అసలు ముట్టకూడదు. ఇష్టమైన మామిడి పండ్లను దూరం పెట్టాలి. నోరూరించే ద్రాక్ష పండ్లను తిన్నట్టు కలలో ఊహించుకోవాలి. మిఠాయిలను ఆస్వాదిస్తున్నట్టు భావించాలి.. అన్నం ఒక్క పూట మాత్రమే తినాలి. ఏం తిన్నా సరే నిజంగానే తీసుకోవాలి.. ఉదయం సాయంత్రం వ్యాయామం చేయాలి.. మాత్రలను సక్రమంగా వేసుకోవాలి. ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. డయాబెటిక్ వచ్చినవాళ్లు ఇలానే జీవనశైలిని సాగిస్తూ ఉండాలి. ఇందులో ఎక్కడ బ్రేక్ పడినా సరే మొదటికే మోసం వస్తుంది. అందుకే డయాబెటిక్ రోగులు సాధ్యమైనంతవరకు నోటిని కంట్రోల్ లోనే ఉంచుకోవాలి.


డయాబెటిక్ రోగులు మితంగా ఆహారం తీసుకుంటూనే బాగుంటుంది. లేకపోతే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి మధుమేహం మరింత పెరుగుతుంది. మధుమేహం వచ్చినవారు బిర్యానీ లాంటి వంటకాలను తినకూడదని వైద్యులు చెబుతుంటారు. వాస్తవానికి బిర్యానీలో ఎటువంటి తీపి పదార్థాలు లేకపోయినప్పటికీ.. అందులో నెయ్యి, బాస్మతి బియ్యం వాడుతారు కాబట్టి.. అందులో గ్లూకోజ్ స్థాయిని పెంచే పదార్థాలు ఉంటాయి కాబట్టి వాడకూడదని వైద్యులు అంటారు. ఇటువంటి డయాబెటిక్ రోగుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా నోరూరించే ప్రత్యేక వంటకాన్ని తయారు చేశారు. దీనిని కోల్ కతా లోని ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ అవధ్ 1590 ఇటీవల ప్రవేశపెట్టింది. దీనికి డయాబెటిక్ ఫ్రెండ్లీ బిర్యానీ అనే పేరు పెట్టింది.. డయాబెటిక్ రోగులకు అవసరమైన పోషకాలతో పాటు.. వారి జీవన క్రియలను మెరుగుపరిచే విధంగా ఈ బిర్యాని రూపొందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ బిర్యానీ అవుట్ లెట్ ను కోల్ కతా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.. టైప్ -1, టైప్ -2 డయాబెటిక్ రోగుల కోసం ఈ బిర్యానీ రూపొందించారు. దీని ధర 350 వరకు ఉంటుంది. ఇక శాఖాహారుల కోసం డయాబెటిక్ సబ్జీ బిరియాని కూడా అందుబాటులో ఉంది. దీని ధరను 275గా నిర్ణయించారు. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కూరగాయలతో పాటు, సోయా గింజలతో ఈ బిర్యానీ తయారు చేస్తారు.. తెల్ల బియ్యం, బంగాళదుంపలతో తయారు చేసిన బిర్యాని డయాబెటిక్ రోగులు ఇటీవల దూరం పెడుతున్నారు. అందువల్లే ఈ బిర్యానీని తాము అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు బియ్యం, చిలగడ దుంపలతో డయాబెటిక్ రోగుల కోసం బిర్యాని తయారు చేస్తున్నారు. పోషకాహార నిపుణులు, వైద్యుల సలహాల మేరకే తాము ఈ బిర్యానీ తయారు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.. ఈ బిర్యానీలో సహజ సిద్ధమైన నెయ్యిని మాత్రమే వాడుతున్నామని.. ఎటువంటి ఆర్టిఫిషియల్ వస్తువులు ఉపయోగించడం లేదని నిర్వాహకులు అంటున్నారు. తమకోసం ప్రత్యేకంగా బిర్యానీని అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో డయాబెటిక్ రోగులు ఈ అవుట్లైట్లో కొనుగోలు చేస్తున్నారు. అయితే భవిష్యత్తు కాలంలో మరిన్ని అవుట్లెట్లు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.