ప్రత్యేక కరెన్సీ లేదు, ఎయిర్ పోర్ట్ లేదు…అయినప్పటికీ యూకే కంటే ధనిక దేశం, జపాన్ కన్నా సురక్షితమైన ఈ దేశం గురించి తెలుసా?

రెన్సీ, ఎయిర్ పోర్ట్ మరియు అసలు ప్రాంతీయ భాష లేని దేశం గురించి విన్నారా? లీచ్టెన్‌స్టీన్…ఐరోపా ఖండంలోని ఈ దేశానికి ప్రత్యేకమైన కరెన్సీ, ఎయిర్ పోర్ట్ మరియు ప్రత్యేకమైన భాష ఏది లేదు.


ఐరోపా ఖండంలోనిఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఈ చిన్న దేశానికి ప్రపంచ పటంలో పెద్దగా గుర్తింపు లేదు. కేవలం 40,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ దేశంలో నేరాలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి పోలీసుల అవసరం కూడా రాలేదు, విదేశాల నుండి అప్పులు కూడా తీసుకోలేదు. ఈ దేశానికి ప్రత్యేకంగా ఏ ప్రాంతీయ భాష లేదు,స్విస్ ఫ్రాంక్‌ను అనుసరిస్తుంది,జర్మన్ దాని అధికారిక భాష. ఈ దేశంలో పౌరుల జీవనశైలి అభివృద్దిచెందిన దేశాలను పోలి ఉంటుంది. ఇటీవల ఈ దేశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎయిర్ పోర్ట్, ప్రత్యేక కరెన్సీ….ఏవి లేవు.

లీచ్టెన్‌స్టీన్…దేశంలో ఏ అతర్జాతీయ విమానాశ్రయం లేదు. పర్యాటకులు జ్యూరిచ్, స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియా విమానాశ్రయాలకు చేరుకుని లీచ్టెన్‌స్టీన్‌కు రావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ దేశం హై-వాల్యూ సెక్టార్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్‌కు కేంద్రంగా మారింది. వ్యూహాత్మకంగా ఈ దేశం ఐరోపా ఖండానికి మధ్యలో ఉండటం, మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయంగా పలు దేశాల నుండి ఇక్కడ సులభంగా చేరుకునే మార్గాలు ఉన్నాయి. అయితే ఈ దేశానికి ఏ అధికారిక కరెన్సీ కూడా లేదు. స్విస్ ఫ్రాంక్ (CHF)ను ఈ దేశ కరెన్సీగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ జర్మన్ భాషను అధికారిక భాషగా గుర్తించారు.

కేవలం 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశం, వాషింగ్టన్ డీ.సీ అంత విస్తీర్ణంలో ఉంది. ఐరోపా ఖండంలో మొనాకో దేశం తర్వాత తలసరి ఆదాయంలో లీచ్టెన్‌స్టీన్‌ రెండో స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క వార్షిక తలసరి ఆదాయం సుమారుగా 197000 డాలర్లు, ప్రపంచంలో చాలా దేశాల తలసరి ఆదాయం కంటే ఇది చాలా ఎక్కువ. అంతే కాదు, నేరాలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి.

దేశం మొత్తం ఖైదీలు 7 మంది, 100 మంది పోలీసులు
ఇటీవల పలు నివేదికల ప్రకారం, దేశం మొత్తం ఏడుగురు మాత్రమే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడి పౌరులు కూడా వారి ఇంటికి తాళాలు వేయరు, దేశం మొత్తం కేవలం 100 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. కాబట్టి ఎంతో సురక్షితమై ఈ దేశాన్ని చూసేందుకు ఎందరో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.

లిచ్టెన్‌స్టెయిన్‌లో రాజరిక పాలన , ప్రజాస్వామ్యం కలయికతో కూడిన పార్లమెంటరీ రాజ్యాంగ రాచరికం కలిగి ఉంది. ఈ దేశ 1921 రాజ్యాంగం ప్రకారం, కార్యనిర్వాహక వర్గం గవర్నింగ్ ప్రిన్స్ మరియు ఎలెక్టెడ్ పార్లమెంటుగా విభజించారు. దీనికి ఐదుగురు సభ్యుల ప్రభుత్వ మంత్రివర్గం ఉంది, దీనిని పార్లమెంట్ నామినేట్ చేసిన గవర్నింగ్ ప్రిన్స్ నాలుగు సంవత్సరాల పదవీకాలానికి నియమించబడుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.