నోరూరించే “టమోటా కొత్తిమీర చట్నీ” – ఇలా చేస్తే అన్నంతో పాటు ఇడ్లీ, దోసెల్లోకి ఎంతో బాగుంటుంది

అన్నం, చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉండే టమోటా పచ్చడి తరచూ చేస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకేలా కేవలం టమోటాలతోనే ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తే రుచిలో కొత్తదనం తెలియదు. కాబట్టి, ఓసారి ఇలా కొత్తిమీర టమోటా పచ్చడి ట్రై చేయండి. ఈ టమోటా కొత్తిమీర చట్నీ వేడి వేడి అన్నంతో పాటు చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోసె వంటి టిఫిన్స్​లోకి రుచి అద్దిరిపోతుంది. మరి సింపుల్​గా కమ్మని కొత్తిమీర టమోటా చట్నీ ఎలా చేయాలో చూద్దామా!


కావాల్సిన పదార్థాలు :

  • టమోటాలు – అర కేజీ
  • టేబుల్​స్పూన్ – మినప్పప్పు
  • టేబుల్​స్పూన్ -శనగపప్పు
  • 2 టేబుల్​స్పూన్లు – పల్లీలు
  • కొత్తిమీర తరుగు – 2 కప్పులు
  • జీలకర్ర – టీస్పూన్
  • పచ్చిమిర్చి – 10
  • ఎండుమిర్చి – 4
  • ఆయిల్ – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా
  • కరివేపాకు – 2
  • వెల్లుల్లి రెబ్బలు – 10
  • చింతపండు – కొద్దిగా
  • పసుపు – అర టీస్పూన్​
  • తయారీ విధానం :

    • ముందుగా టమోటాలను రెండు మూడుసార్లు శుభ్రంగా కడగండి. ఆపై కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చట్నీలోకి కావాల్సిన కొత్తిమీరను కాడలతో సహా సన్నగా తరుక్కోవాలి.
    • అనంతరం స్టవ్​ వెలిగించి పాన్ పెట్టుకొని టేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
    • ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత టేబుల్​స్పూన్ చొప్పున మినప్పప్పు, శనగపప్పు, 2 టేబుల్​స్పూన్లు పల్లీలు, టీస్పూన్​ జీలకర్ర వేసి రంగు మారేంత వరకు వేయించండి. పల్లీలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
    • అనంతరం అదే కడాయిలో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. పచ్చిమిర్చీ చక్కగా వేగి పైన తెల్లటి రంగు వచ్చిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపండి. కరివేపాకు దోరగా వేగాక ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
    • ఇప్పుడు అదే కడాయి​లో కొద్దిగా ఆయిల్ పోసి వేడి చేయండి. ఇప్పుడు కట్ చేసిన టమోటా ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసి వేయించండి. టమోటాలు 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆపై రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి.
    • టమోటాలు మెత్తబడిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆపై ఈ టమోటా మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
    • అదే కడాయి​లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఇందులో 2 కప్పులు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి 3 నిమిషాలు వేయించండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి.
    • ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమం వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఆపై ఇందులోనే వేయించుకున్న పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర మిశ్రమాలు వేసి పల్స్​ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి.
  • అంతే ఇలా సులభం​గా రెడీ​ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమోటా చట్నీ మీ ముందుంటుంది! రుచికరమైన ఈ కొత్తిమీర, టమోటా పచ్చడికి మీరు కావాలంటే తాలింపు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోయిన ఈ టమోటా కొత్తిమీర చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.