విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం కింగ్ డం. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరుపై సాయి సౌజన్య నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
అణగారిన వర్గాల కోసం నాయకుడు చేసే పోరాటం
తాజాగా ఈ సినిమాను దర్శక సంచలనం సందీప్ రెడ్డి వంగా చూశారు. దర్శకుడు గౌతమ్ సినిమా కథను చక్కగా చెప్పారని, సినిమాలో కీలక భాగమైన 40 నిముషాలను చూశానని, కొంతచూసిన తర్వాతే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తనకు కలిగిందని సందీప్ చెప్పారు. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో నే మంచి నటన కనపరిచారని, సినిమా విజయంపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కింగ్ డం సినిమాకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు మద్దతుగా నిలిచారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఓ వర్గానికి చెందిన నాయకుడిగా హీరో చేసే పోరాటమే ఈ సినిమా.
గన్ లోడ్ చేసి ఎక్కుపెట్టాం
కింగ్ డం ట్రైలర్ బాగుందని టాక్ వస్తోంది. ఇటీవలే సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కూడా మంచి రిపోర్టు ఇచ్చారు. సినిమాలోని రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు చూసి వాటికి రంగు మార్చమని చెప్పి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా చాలా విభిన్నంగా ఉందన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. గన్ లోడ్ చేసి ఎక్కుపెట్టామని, సినిమా రన్ టైం 162 నిముషాలుగా ఉందని చెప్పింది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.
































