కాలికి నల్లదారం కడుతున్నారా..? అయితే ఈ నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!

భారతీయ సంప్రదాయంలో చెడు దృష్టి నివారణ కోసం కాలికి నల్లదారం కట్టడం సాధారణంగా కనిపించే ఆచారం. అయితే ఇది అందరికీ మంచిదే అనే అనుకోవద్దని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కొంతమంది రాశులవారికి నల్లదారం పెట్టడం వల్ల శుభం కలుగుతుందని చెప్తే, మరికొంతమందికి అయితే తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని చెబుతున్నారు.

ఎవరు నల్లదారం కట్టకూడదు?

మేష రాశి: ఈ రాశివారికి నల్లదారం వల్ల నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. కాబట్టి తప్పక తొలగించాలంటున్నారు.

వృశ్చిక రాశి: అంగారకుడి ఆధిపత్యంలో ఉన్న ఈ రాశివారు నల్లదారం ధరిస్తే, మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు, అశుభ సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందట.

సింహ రాశి: ఈ రాశి వారికి నల్లదారం పెడితే గృహంలో కలహాలు, ఆర్థిక నష్టాలు, నెగటివ్ శక్తుల ప్రభావం పెరుగుతుందని జ్యోతిషులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు నల్లదారం ధరిస్తే దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు అధికమవుతాయని చెబుతున్నారు.

ఎవరు కట్టుకోవచ్చని చెప్తున్నారు?

ధనస్సు, తుల, కుంభ రాశుల వారికి నల్లదారం శుభప్రదం.

వృషభం, మిథునం, కన్య, మకర, మీన రాశులకు తటస్థ ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.

శాస్త్రీయ పద్ధతిలో ఎలా కట్టాలి?

నల్లదారం ధరించే ముందు శనివారం రోజు దేవుడి ముందుంచి పూజ చేయాలి.

అనంతరం రుద్ర గాయత్రి మంత్రం లేదా శనిమంత్రాన్ని 9, 27, 54 లేదా 108 సార్లు జపించి ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక:

ఈ విషయాలు జ్యోతిష నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చినవే. శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. వాటిపై విశ్వాసం వ్యక్తిగతం మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.