జిగురు లేకుండా “బెండకాయ ఫ్రై” – ఈ చిన్న ట్రిక్​ని ఫాలో అవ్వడంలోనే సీక్రెట్ అంతా

పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది బంకగా, చప్పగా ఉంటుందని బెండకాయను అంతగా తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అదే, కొంతమంది పిల్లలు బెండకాయతో చేసే ఫ్రైని ఇష్టంగా తింటుంటారు. అయితే, ఈ వేపుడు కూడా ఎన్నిసార్లు ఎంత బాగా ప్రిపేర్ చేసినా టేస్ట్​లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే, క్రిస్పీగా కూడా రావట్లేదని ఫీల్ అయ్యే మమ్మీలు చాలా మందే ఉంటారు. అలాంటి వారికోసమే పర్ఫెక్ట్ స్టైల్​లో ప్రిపేర్ చేసుకునే “బెండకాయ మసాలా ఫ్రై” రెసిపీని తీసుకొచ్చాం. ఈ పద్ధతిలో చేశారంటే ఎన్నడూ బెండకాయ తినని వాళ్లూ దీన్ని ఇష్టంగా లాగిస్తారు. అంతేకాదు, లంచ్ బాక్స్​లోకి క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి, తక్కువ టైమ్​లో మంచి రుచికరంగా బెండకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


అవసరమైన పదార్థాలు :

  • బెండకాయలు – అరకిలో
  • అల్లం – అరఇంచు ముక్క
  • పచ్చిమిర్చి – ఆరేడు
  • వెల్లుల్లి రెబ్బలు – ఐదారు
  • కరివేపాకు – రెండు రెమ్మలు
  • నూనె – తగినంత
  • సన్నని ఉల్లిపాయ ముక్కలు – ఒకటిన్నర కప్పులు
  • ఇంగువ – అరటీస్పూన్
  • మీడియం సైజ్ టమాటాలు – రెండు
  • పసుపు – అరటీస్పూన్
  • కారం – టేస్ట్​కి సరిపడా
  • ధనియాల పొడి – ఒక టీస్పూన్
  • పెరుగు – నాలుగు టేబుల్​స్పూన్లు
  • మ్యాగీ మసాలా పొడి – రెండు చెంచాలు
  • తయారీ విధానం :

    • ఈ రుచికరమైన బెండకాయ మసాలా ఫ్రై కోసం ముందుగా తాజా బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి.
    • ఆపై వాటిని నీళ్ల తడి లేకుండా క్లాత్​తో తుడవాలి. తర్వాత బెండకాయలను రెండు చివర్లు కట్​ చేసి మీడియం సైజ్​లో చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
    • అనంతరం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకొని కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు గాలికి ఆరబెట్టుకోవాలి.
    • ‘బెండకాయ ముక్కలను కొద్దిసేపు గాలికి ఆరబెట్టుకునే’ ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం ద్వారా ఫ్రై అనేది జిగురుగా రాకుండా ఉండడంతో పాటు క్రిస్పీగా, మంచి రుచికరంగానూ వస్తుంది.
    • ఆలోపు రెసిపీలోకి అవసరమైన పచ్చిమిర్చి పేస్ట్​ని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
    • ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్​గా వేడయ్యాక అరగంట పాటు ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్​లో పావు గంట నుంచి ఇరవై నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
    • అంటే, బెండకాయ ముక్కల్లోని జిగురు పోయి లోపలి వరకు చక్కగా వేగాలి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద మళ్లీ అదే పాన్ పెట్టుకొని మరో రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్​ని యాడ్ చేసుకొని అందులోని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి.
  • తర్వాత అందులో టమాటా ముక్కలు, పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని అవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
  • ఆలెడ్రీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. కాబట్టి, అవి ఉండే కారాన్ని బట్టి ఈ స్టేజ్​లో తగినంత ఎండుకారం, ఉప్పు అనేవి చూసి వేసుకోవాలి.
  • మిశ్రమాన్ని చక్కగా కలిపాక మూతపెట్టి లో ఫ్లేమ్​లో టమాటాలు మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి.
  • టమాటాలు సాఫ్ట్​గా మగ్గాయనుకున్నాక మూత తీసి ఒకసారి కలిపి పెరుగుని యాడ్ చేసుకొని అది ఆ మిశ్రమంలో చక్కగా కలిసి నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్​లో మూడ్నాలుగు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆఖర్లో మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అది మొత్తం కలిసేలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే సరిపోతుంది. అంతే, యమ్మీ యమ్మీగా నోరూరించే “బెండకాయ మసాలా వేపుడు” రెడీ అయిపోతుంది!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.