నిద్రకు దూరం అవుతున్నారా? అయితే ఇలా చేయండి.

నిద్ర అనేది మన శరీరానికి, మనసుకు అవసరమైన విశ్రాంతిని ఇస్తుంది. నిజానికి నిద్ర అనేది మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే, నిద్ర సరిపడా సమయాన్ని కేటాయించాలి.


రోజులో కనీసం 7 నుంచి 8 నిద్ర తప్పకుండా అవసరం. లేకపోతే శారీరక ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తుంది, మానసిక స్థితి అస్థిరంగా మారుతుంది. నిరంతరంగా నిద్రలేమి సమస్య ఉంటే అది మానసిక ఒత్తిడికి, అధిక రక్తపోటుకు, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలకు దారితీస్తుంది. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. మరి మంచి, గాఢమైన నిద్ర కోసం కొన్ని మార్పులు చేసుకోవడం అనివార్యం. మరి ఆ అలవాట్లు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.నిద్రకి ముందే జీవన శైలిలో మార్పులు:

నిర్దిష్ట నిద్ర సమయం:
ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల చేయడం శరీరంలో “సర్కేడియన్ రిథం” (circadian rhythm) స్థిరంగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.

నిద్రకు ముందు మానసిక ప్రశాంతత:
రాత్రివేళ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడటం తగ్గించాలి. వీటిలో ఉండే నీలి కాంతి (blue light) కాళ్లపై ప్రభావాన్ని చూపించి మెళుకువను పెంచుతుంది.

విశ్రాంతి ప్రదేశం:
మీ పడకగది శుభ్రంగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. అవసరమైతే మృదువైన మ్యూజిక్ లాంటి వాటిని ఉపయోగించవచ్చు.

2. ఆహారపు అలవాట్లు:

నిద్రకు ముందుగా తేలికపాటి భోజనం:
నిద్రకు ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి. అధిక భోజనం నిద్రలో ఆటంకం కలిగిస్తుంది. మంచి నిద్ర కోసం పడుకునే ముందు కనీసం 2 నుంచి 3 గంటల ముందు తినడం మంచిది.

కాఫీ, టీ, సోడా తగ్గించండి:
కాఫీ లేదా టీలో ఉండే కేఫిన్ నిద్రకు ప్రధాన శత్రువు. వీటిని సాయంత్రం తర్వాత తీసుకోకూడదు. ఖర్జూరం, అరటి, పాలు వంటి వాటిలో సహజంగా ట్రిప్టోఫాన్, మెలటొనిన్ ఉంటాయి. ఇవి నిద్ర సహాయక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

3.యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు:

శవాసన:
రాత్రి పడుకునే ముందు 5 నుంచి 0 నిమిషాలు శవాసన చేయడం శరీరాన్ని, మనసును శాంతంగా ఉంచుతుంది.

గమన శ్వాస:
ఇది గుండె స్పందన తగ్గించడానికి, ఒత్తిడి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.

ప్రణయామం:
నిద్రకు ముందు 5 నిమిషాల ప్రాణాయామం చేయడం వల్ల మెదడులో శాంతి కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.

4.ఇతర పద్ధతులు:

గోరువెచ్చని నీటితో స్నానం:
శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

పుస్తక పఠనం:
నిద్రకు ముందు కథలు లేదా సాహిత్య పుస్తకాలు చదవడం మెదడుకు శాంతినిచ్చి నిద్రకు సహాయపడుతుంది.

రాత్రి మంచి నిద్ర అనేది ఆరోగ్యానికి గొప్ప బహుమతి. నిద్ర కోసం మందుల మీద ఆధారపడకుండా, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, మనసుకు ప్రశాంతతను అలవరచుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.