ముల్లంగిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ప్రతి ముల్లంగి ముక్కకు అన్ని పట్టేలా కలపండి.
ఉసిరికాయలను ముందుగా ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ఆవాలు వేసి బాగా కలపాలి.
తయారు చేసిన మిశ్రమాన్ని 3-4 రోజులు ఎండలో ఉంచాలి. ఇది ఊరిన తర్వాత మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
క్యారెట్ని పొడవాటి ముక్కలుగా కోసి, ఉప్పు, పండిన మిరపకాయలు, వాము, ఆవాల నూనె వేసి కలపండి. మసాలా క్యారెట్కి సమానంగా పట్టేలా బాగా కలపండి.
ఇప్పుడు దీనిని 3-4 రోజుల పాటు ఎండలో ఉంచండి. కారంగా, కొద్దిగా పుల్లగా.. తినడానికి రుచిగా ఉంటూ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
చిన్న ఉల్లిపాయలను పైన తొక్కలు తీసి.. దానిలో ఉప్పు, ఎర్ర మిరపకాయలు, కొద్దిగా వెనిగర్ వేసి తరువాత పైన ఆవాల నూనె వేసి బాగా కలపండి.
ఈ ఊరగాయ ఒక్క రోజులో తయారవుతుంది. ఈ ఉల్లిపాయల ఊరగాయ తినడానికి రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోటీ లేదా పరాఠాతో తింటే చాలా బాగుంటుంది.



































