పవర్ హౌస్ ఎనర్జీ కోసం వీటిని తప్పకుండా తినండి

భారతీయ వంటకాల్లో రొయ్యలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటి రుచి, పోషక విలువలతో ఎంతోమందికి రొయ్యలు అంటే బాగా ఇష్టం ఉంటుంది. రొయ్యలు రోగనిరోధక శక్తిని పెంచే కీలకమైన పోషకాలతో నిండి ఉంటాయి.


రొయ్యల్లో అధిక స్థాయిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారికి ఇవి ఆహారంలో మంచి ఎంపిక.

ప్రోటీన్ పుష్కలంగా

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావలసినంత ప్రోటీన్ ఉండాలి. శరీర కణజాల నిర్మాణానికి, వాటి మరమ్మతులకు ప్రోటీన్ చాలా అవసరం. రొయ్యల్లో పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, శరీర పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మీ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి రొయ్యలు చాలా బాగా పనిచేస్తాయి.

విటమిన్లు మరియు ఖనిజాలు

విటమిన్ B12, విటమిన్ ఈ, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, డీఎన్‌ఏ ఉత్పత్తికి తోడ్పడతాయి. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడే యాంటీఆక్సిడెంట్ విటమిన్ E కూడా వీటిలో ఉంటుంది. అలాగే జింక్, సెలీనియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తక్కువ కేలరీలు

బరువు తగ్గాలనుకునే వారికి లేదా తక్కువ కేలరీల ఆహారం తీసుకునే వారికి రొయ్యలు మంచి ఆహారంగా చెప్పొచ్చు. ఇవి అధిక కేలరీలను జోడించకుండానే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పోషకాల లోపం లేకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి రొయ్యలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు రొయ్యల్లో ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో మంటను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆహారంలో రొయ్యలను చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.రొయ్యలను అనేక రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. కూరల నుండి సలాడ్‌ల వరకు వీటిని ఎన్నో రకాలుగా చేయవచ్చు.

సులభంగా చేసుకోగలిగిన ఆహారాలలో రొయ్యలు ఒకటి

అవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి, బిజీగా ఉండే వ్యక్తులకు పోషకమైన ఆహారాన్ని తక్కువ సమయంలో తయారు చేసుకోవడానికి వీలవుతుంది. భారతీయ వంటకాలలో రొయ్యలను చేర్చడం, వాటి పోషకాలతో మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఆహారంలో అప్పుడప్పుడు తప్పనిసరిగా రొయ్యలను చేర్చుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.