సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఖాన్ సార్‌కు రాఖీ పండుగ రోజు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తక్కువ ఫీజుతో ఉద్యోగార్థులకు కోచింగ్ ఇచ్చే ఖాన్ సార్‌కు ఎంతో మంచి పేరు ఉంది.
అయితే.. ఈయన ముస్లిం అయినప్పటికీ.. రాఖీ రోజు ఆయన చేతికి వందల మంది అమ్మాయిలు రాఖీలు కట్టారు. అన్ని రాఖీలు కట్టేసరికి ఆయన చేతికి దెబ్బకు బ్లడ్ సర్క్యూలేషన్ ఆగిపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అమ్మాయిలు ఖాన్ సర్ కు రాఖీ కట్టడానికి పాట్నా చేరుకున్నారు.
అన్ని రాఖీలు కట్టేసరికి తన చేతికి బ్లడ్ సర్క్యూలేషన్ నిలిచిపోయిందంటూ ఖాన్ సార్ సరదాగా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పండగ హిందూవులది అయినా.. అత్యధిక రాఖీలు కట్టించుకున్న వ్యక్తి ముస్లిం అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈ పండగ మత సామరస్యానికి ప్రతీక అంటూ కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
































