రేపే శ్రీ కృష్ణ జన్మాష్టమి.. పూజ శుభ ముహూర్తం, పూజా విధానం, పూజ సామాగ్రి తెలుసుకోండి..

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండగను ఈ ఏడాది ఆగస్టు 16న అంటే రేపు దేశ వాప్తంగా జరుపుకోనున్నారు. ఈ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీ కృష్ణ జయంతి, జన్మాష్టమి, శ్రీ జయంతి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్య అనుగ్రహం కోసం పూజ శుభ సమయం ఎప్పుడు? పూజా సామాగ్రి తదితర వివరాలను గురించి తెలుసుకుందాం..

శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే ఈ రోజుని శ్రీ కృష్ణ జన్మాష్టమి అని పిలుస్తారు. దేవకీనందులకు అర్ధరాత్రి అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు. అందుకే జన్మాష్టమిని నిర్ణయించడంలో అష్టమి తిథి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడి బాల రూపాన్ని పూజిస్తారు. శ్రీ కృష్ణుడి బాల రూపాన్ని లడ్డూ గోపాల్ అని బాల గోపాలుడు అని పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 16న అంటే రేపు దేశవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకోనున్నారు.


జన్మాష్టమి అష్టమి తిథి ఆగస్టు 15న అంటే ఈ రాత్రి 11:49 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి ఆగస్టు 16న అంటే రేపు రాత్రి 9:34 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఈసారి కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 16న అంటే రేపు జరుపుకుంటారు. అయితే శ్రీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రోహిణి నక్షత్రం ఒకే రోజు సంభవించడం లేదు. ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం ఆగస్టు 17న ఉదయం 4:38 నుంచి ఆగస్టు 18న తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది.

కృష్ణ జన్మాష్టమి పూజ ముహూర్తం

కృష్ణ జన్మాష్టమి పూజ ముహూర్తం ఆగస్టు 17న తెల్లవారుజామున 12:04 నుంచి 12:47 వరకు ఉంటుంది, దీనికి మొత్తం 43 నిమిషాలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో జన్మాష్టమి ముగింపు ఆగస్టు 17న ఉదయం 5:51 గంటల తర్వాత మాత్రమే జరుగుతుంది.

కృష్ణ జన్మాష్టమి పూజ విధి

జన్మాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఆ తర్వాత శ్రీకృష్ణుని బాల రూపాన్ని అలంకరించి, ఆయనను నియమాలతో పూజించండి. బాల కృష్ణుడిని ఊయలలో కూర్చోబెట్టి, పాలు, గంగా జలంతో అభిషేకించండి. కొత్త బట్టలు, కిరీటం, వేణువు, వైజయంతి హారంతో అలంకరించండి. తులసి దళాలు, పండ్లు, వెన్న, చక్కెర మిఠాయి ఇతర ప్రసాదాలను భోగభాగ్యాలలో సమర్పించండి. చివరగా హారతి ఇచ్చి.. అందరికీ ప్రసాదాన్ని పంపిణీ చేయండి.

జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజకు అవసరమైన సామాగ్రి

ఊయల, శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్ర పటం, వేణువు, ఆభరణాలు, కిరీటం, తులసి దళాలు, గంధం, అక్షతం, వెన్న , కుంకుమ, యాలకులు ఇతర పూజా సామాగ్రి, కలశం, గంగాజలం, పసుపు, తమలపాకు, సింహాసనం, బట్టలు (తెలుపు మరియు ఎరుపు), కుంకుమ, కొబ్బరి కాయ, మౌళి, సుగంధ ద్రవ్యాలు, నాణేలు, ధూపం, దీపం, అగరబత్తి, పండ్లు, కర్పూరం, నెమలి ఈక, ఈ వస్తువులన్నీ శ్రీకృష్ణుని పూజ, అలంకరణ కోసం ఉపయోగించాలి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.