70 రూపాయలకే కడుపునిండా భోజనం…తిన్నంత భోజనం వెనుకున్న వ్యాపార రహస్యం ఇదే!

 మధ్య కాలం లో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కడ చూసినా బాగా పాపులరైన ఫుడ్ బిజినెస్ తిన్నంత భోజనం. ఉద్యోగాల కోసమో, పనుల కోసమో నగరాలు చేరుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది.


నగరాల్లో ఎదో ఒక పని వెతుక్కున్నాకా వారికి అవసరమైంది రూమ్ అండ్ ఫుడ్. వారిని టార్గెట్ చేసి అనేక మెస్సులు, హోటల్స్, కర్రీ పాయింట్ లు తమ వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి. అయితే ఈ మధ్య కాలం ఎక్కడ చూసినా తిన్నంత భోజనం, కడుపు నిండా తినిపో ఇలాంటి పేర్లతో హోటల్స్ ఎక్కువయ్యాయి. అది కూడా 100 – 150 రూపాయలకే నాన్ వెజ్ మీల్స్, 75 – 100 రూపాయలకు వెజ్ మీల్స్ తిన్నంత పెట్టేస్తున్నారు. అసలు ఇది ఎలా వర్క్ అవుట్ అవుతుంది. అసలు బోర్డు పెట్టేస్తున్నారు సరే నిజంగా హోటల్ లో కి వెళ్ళాక ఫుడ్ అంత పెడుతున్నారా? క్వాలిటీ ఉంటుందా? అసలు వీరికి లాభాలు ఎలా వస్తాయి? ఇలా ఈ హోటల్స్ ని చూసి మీ మైండ్ ల వచ్చే డౌట్స్ తీరాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే…

అసలు ఈ తిన్నంత భోజనం కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. ఎప్పుడో 1970 ల కాలంలో అమెరికా వంటి దేశాల్లో మొదలైంది. అది చూసి మనకు మెల్లగా నగరాల్లోకి ముందుగా మొదలయ్యింది. అయితే ఇలా రోడ్ సైడ్ మెస్ లు చిన్న హోటల్స్ లో కాదు కాస్త పెద్ద హోటల్స్ లో బఫే లో పెట్టేవారు. ఒక పర్సన్ కు 500 నుండి 1000 రూపాయల మధ్యలో పే చేస్తే కావలిసినంత తినొచ్చు అనేసరికి జనం ఎగబడేవారు. అన్ని ఐటమ్స్ మంచి క్వాలిటీ లో తయారు చేసి పెట్టటంతో బాగానే వర్క్ అవుట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో Barbeque (BBQ) రెస్టారెంట్లు కూడా ఇవే కోవకు చెందినవే. కాకపోతే గ్రిల్ల్డ్ ఫుడ్ మెయిన్ కోర్స్ ఇక్కడ. ఇందులో కూడా బఫెట్ అండ్ సీటింగ్ స్టైల్ లో అందుబాటులో ఉన్నాయి. ఇదే మెల్లగా ఇప్పుడు స్త్రీట్స్ కి పాకింది. ఆఫీసులకెళ్ళే ఉద్యోగులు, బాచిలర్స్ ను టార్గెట్ చేసి తక్కువ కాస్ట్ లో భోజనం పెట్టటం…అది కూడా తిన్నంత భోజనం అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మెల్లగా ఇవి విస్తరిస్తున్నాయి.

మరి లాభాలు ఎలా?

జనాలకు ఇక్కడ నిజానికి తిన్నంత బోజనమే పెడతారా అంటే నిజమే పెడతారు. Barbi Q (BBQ), బఫే లలో అయితే ధర ఎక్కువ కాబట్టి అన్ని ఐటమ్స్ అందుబాటు లో ఉంటాయి. అయితే ఆ ఐటమ్స్ లో తక్కువ ఖరీదు తో ఎక్కువ లాభాలు వచ్చే ఐటమ్స్ ని వడ్డిస్తారు. ఇంకో టెక్నిక్ భోజనం తినే ప్లేట్ చిన్నగా బరువైంది పెట్టడం. దీంతో బఫెట్ లో నిలబడి తినేప్పుడు బరువైన ప్లేట్ పట్టుకుని తినడం కొంచం ఇబ్బందిగా ఉంటుంది. చిన్న ప్లేట్ అవ్వటం వల్ల కూడా అనేక సార్లు వడ్డించుకుని తినేసరికి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. దాంతో అనేక సార్లు వడ్డించుకోవడం, మొహమాటం ఇలా ఎన్నో కలిసి ఎక్కువగా తిననివ్వవు. ఇది అందరు ఎదుర్కునే ఇబ్బందే. కొన్ని పెద్ద హోటళ్లు నిజంగానే క్వాలిటీ ఫుడ్ అన్ లిమిటెడ్ పెడతాయి. ముఖ్యంగా నగరాల్లో ఈ ఆఫర్స్ ఉంటాయి. కాకపోతే అవి కొంచెం లేట్ గా మొదలుపెట్టటంవల్ల మిగిలిపోయిన ఐటమ్స్ కూడా అక్కడ పెట్టి వర్కౌట్ చేస్తారు. ఇక Barbeque (BBQ) విషయానికి వస్తే ముందుగా సర్వ్ చేసే గ్రిల్ల్డ్ ఐటమ్స్ కడుపు త్వరగా ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేవి సర్వ్ చేస్తారు. దాంతో తినాలని ఉన్న ఎక్కువ తినలేము. ఫైనల్ లో మెయిన్ కోర్స్ కి వచ్చే సరికి తినే ఫీలింగ్ ఉండదు. ఇదీ ఈ పెద్ద బఫెట్ ల బిజినెస్ టెక్నిక్.

ఇక చిన్న హోటళ్లకు వస్తే వల్ల టార్గెట్ ముందుగా హోటల్ బిజినెస్ నిలబడటం. చాలా వరకు హోటళ్లలో బోర్డు మాత్రమే ఉంటుంది. లోపలకు వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ తింటేనే ఈ ఆఫర్ అని చెప్తారు. సో మనం వాటిని తినలేము కాబట్టి వేరే ఐటమ్స్ ఆర్డర్ చేస్తాము. కొన్ని హోటల్స్ చికెన్ బిర్యానీ అన్ లిమిటెడ్ అని పెట్టినా కూడా అందులో రైస్ క్వాంటిటీ ఎక్కువ పెట్ట్టటం వల్ల మనకి ఫుల్ అయిపోతుంది. ఎక్స్ట్రా నాన్ వెజ్ అడిగితే నో చెప్తారు. ఎక్కువమంది రావడం వల్ల కూడా ఓవరాల్ బిజినెస్ పెరగటం వల్ల కూడా లాభం ఖచ్చితం గా వస్తుంది. ఇంతేకాక వీరికి కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడంతో లాయల్ కస్టమర్ బేస్ ఏర్పడుతుంది. దాంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.

సో ఇదీ తిన్నంత భోజనం కథ. ఈ ప్రపంచంలో ఎవడూ మనకు షాప్ లు పెట్టి రెంట్లు కట్టి, వర్కర్లకు జీతాలు ఇచ్చుకుని తక్కువ రేటుకు ప్రోడక్ట్ ఇవ్వడు. ఇది వ్యాపారం. అమ్మటం కొనడం ఇదే సూత్రం. లాభం తీసుకోవడమే పరమార్ధం. కాకపోతే కస్టమర్ ను ఆకర్షించడానికి రకరకాల మార్గాలు. డిస్కౌంట్ ఆఫర్లు, తిన్నంత భోజనాలు ఇలా ఎదో ఒకటి. వాళ్ళకి వ్యాపారం అవుతుంది. మనకి సమయానికి మంచి భోజనం తక్కువలో తిని ఆకలీ తీరుతుంది. అయితే కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు లాభాపేక్ష లేకుండా కూడా తక్కువ రేటుకి తిన్నంత భోజనాన్ని పెడతాయి. అవి మాత్రం ఈ కోవకు చెందినవి కాదు అని గుర్తించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.