మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్త మిత్రుడు, సోదర సమానుడు ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు పేర్లలో ఒకటి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna).
వీళ్లిద్దరు కూడా గత జనరేషన్ కి చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పోరు అప్పట్లో తారా స్థాయిలోనే ఉండేది. అయినప్పటికీ కూడా వీళ్లిద్దరు అన్నదమ్ములు లెక్కనే ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. అంతే కాకుండా నాగార్జున ఎప్పుడు సూపర్ హిట్ కొట్టినా చిరంజీవి ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని ఏర్పాటు చేసి నాగార్జున కి శుభాకాంక్షలు తెలియచేసి, ఆయన నటించిన సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాడు. రీసెంట్ గా విడుదలైన ‘కుబేర’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కూడా చిరంజీవి భాగమై ఎంత అద్భుతంగా మాట్లాడాడో మనమంతా చూశాము.
కుబేర చిత్రం లోని నాగార్జున క్యారక్టర్ ని చూసి చిరంజీవి ఎంత సంతృప్తి పడ్డాడో, ‘కూలీ'(Coolie Movie) చిత్రం లో నాగార్జున పోషించిన ‘సైమన్’ క్యారక్టర్ ని చూసి అంతే అసంతృప్తి చెందినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని అభిమానులు కూడా సెకండ్ హాఫ్ లో నాగార్జున క్యారక్టర్ ఎండింగ్ ని చూసి చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం మనమంతా చూసాము. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ కూడా దాదాపుగా అలాగే ఉన్నింది అట. నువ్వు ఎంత పెద్ద సూపర్ స్టార్ వి, నువ్వు చేసిన సినిమాలు ఎలాంటివి, నువ్వు పోషించిన పాత్రలు ఎలాంటివి, అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న నువ్వు, ఇలాంటి క్యారక్టర్ చేస్తావా?,నాగార్జున విలన్ క్యారక్టర్ చేస్తున్నాడంటే, చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్ర ఉంటుందని అనుకున్నాను కానీ, ఇలా ఉంటుందని అనుకోలేదు, దయచేసి ఇలాంటి క్యారెక్టర్స్ ఇక చేయకు, నేను నిన్ను అలాంటి పాత్రల్లో చూడలేను, నా మీద గౌరవం ఉంటే చెయ్యవు అని నాగార్జున తో చిరంజీవి అన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.
మరి ఇది నిజమైతే నాగార్జున చిరంజీవి చెప్పిన మాటలను వింటాడా?, లేదా తన మనసుకి నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తాడా అనేది చూడాలి. నాగార్జున అభిమానులు కానీ వాళ్లకు కూడా, కూలీ లో ఆయన క్యారక్టర్ అలా ముగియడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు రజినీకాంత్ అయినా ఇలాంటి క్యారక్టర్ నాగార్జున కి సరిపోదు, వేరే ఏదైనా పవర్ ఫుల్ క్యారక్టర్ ఉంటే చూడండి అని ఎందుకు డైరెక్టర్ కి చెప్పలేకపోయాడు?, ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ కంటే రచిత రామ్, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర క్యారెక్టర్స్ అద్భుతంగా ఉన్నాయి అనే అభిప్రాయం చూసే ప్రతీ ఒక్కరికి కలిగింది. చూస్తుంటే నాగార్జున ఈమధ్య తన సినిమాల ఎంపిక లో పట్టు తగ్గినట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.



































