మీరు వేరు శెనగ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర విలువైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.


మాంసాహారం తినని వారు ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి వేరుశెనగలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, వీటిని మితిమీరిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేరుశెనగలు అధికంగా తీసుకుంటే కలిగే సమస్యలు
1. బరువు పెరగడం

వేరుశెనగల్లో కేలరీలు మరియు కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించినా, మితిమీరిన మోతాదులో తీసుకుంటే శరీరంలో అధిక కేలరీలు నిల్వ అవుతాయి. దీని ఫలితంగా బరువు వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

2. కాలేయానికి హానికరం

తడి లేదా సరైన రీతిలో నిల్వ చేయని వేరుశెనగలపై అఫ్లాటాక్సిన్ అనే ఫంగస్ పెరుగుతుంది. ఇది ఒక హానికరమైన టాక్సిన్. ఇది కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

3. జీర్ణ సమస్యలు

వేరుశెనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కానీ అధికంగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బసం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

4. అలెర్జీలు

కొంతమందికి వేరుశెనగలపై అలెర్జీ ఉండవచ్చు. అలాంటి వారు వేరుశెనగలు తింటే చర్మంపై దద్దుర్లు,
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.గొంతులో వాపు వంటి తీవ్రమైన ప్రతిక్రియలు రావచ్చు. ఇది గంభీర ఆరోగ్య ప్రమాదానికి దారితీయవచ్చు. అలెర్జీ ఉన్నవారు పూర్తిగా దూరంగా ఉండాలి.

5. పోషకాల గ్రహణంపై ప్రభావం

వేరుశెనగల్లో ఉండే భాస్వరం (phytates) శరీరంలో జింక్, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల పోషక లోపాలు ఏర్పడే అవకాశముంది

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.