వర్షాకాలం రాగానే మనకు అనేక రకాల కొత్త పురుగులు కనిపిస్తూ ఉంటాయి. భూమి లోపల ఉన్న కొన్ని పురుగులు బయటకు రాగా.. అడవిలో ఉండే క్షీరదాలు వరదల ద్వారా కొట్టుకు వస్తూ ఉంటాయి.
ఇలాగే నల్లగా ఉంటూ భారీ కొమ్ములు కలిగిన ఒక పురుగు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కానీ ఇది కొడుతుందేమోనన్నా భయంతో చాలామంది దీనిని చంపుతూ ఉంటారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేకపోయినా… ఇది ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే దీని ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
STAG BEGGAL అనే పేరుగల ఈ పురుగు ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తూ ఉంటుంది. దీని దవడలు పెద్దగా ఉంటాయి. ఇవి ఎక్కువగా పాడైపోయిన కలపలో జీవిస్తాయి. పర్యావరణ వ్యవస్థలో కొన్ని వస్తువులు కుళ్లిపోవడానికి ఇవి సహకరిస్తాయి. ప్రపంచంలో అత్యంత అరుగుదైన జాతిగా వీటిని కీర్తిస్తారు. అందుకే వీటికి కొన్ని దేశాలలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చైనా దేశంలో వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. రోజురోజుకు వీటి జాతి అంతరించిపోతుందని వీటిని కాపాడుతూ ఉన్నారు. వీటివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ చూస్తే మాత్రం భయంకరంగా ఉంటాయి. స్టాక్ బెగ్గల్ గుడ్డు, లార్వా, వ్యూప దశల తో పూర్తిగా రూపాంతరం చెందుతుంది.
స్టాగ్ బెగ్గల్ ను అదృష్టంగా భావిస్తారు. దీనికి భారతదేశంలో రూ. 75 లక్షల ధర పెట్టేవారు ఉన్నారు. కొందరు కొన్ని అనారోగ్యాల నివారణకు వీటిని ఉపయోగించుకుంటారు. ఈ పురుగుకు సంబంధించిన తలను ధరించడం వల్ల తలనొప్పి, తిమ్మిర్లు, రుమాటిజం నుంచి రక్షణ లభిస్తుందని అంటున్నారు. మూర్చ వ్యాధి నుంచి కూడా ఇది కాపాడుతుందని చెబుతున్నారు. అయితే దీనికి మన దేశంలో కంటే ఎక్కువగా జపాన్లో, చైనాలో ఎక్కువగా డిమాండ్ ఉంది. వీరు ఇక్కడ అత్యధిక ధరణి చెల్లించి కొనుగోలు చేస్తారు.
స్టాగ్ బెగ్గల్ ను జింక బీటెల్ అని కూడా పిలుస్తారు. దీనికి జింక వాలే కొమ్ములు ఉంటాయి. అందుకే ఆ పేరుతో పిలుస్తారు. అయితే ఆడ పురుగు దవడలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా భూమిపైనే జీవిస్తాయి. కలపను తింటూ సొరంగాలు చేయడానికి ఎక్కువగా శ్రమిస్తాయి. ఒక్కో పురుగు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి ఎక్కువ శాతం భూమిలోపలే ఉంటాయి. వర్షాకాల సమయంలో మాత్రం బయటకు వచ్చి అలరిస్తాయి. అయితే ఇకనుంచి ఎప్పుడైనా ఇవి కనిపిస్తే చంపకుండా వెంటనే దానిని దాచేయండి. ఆ తర్వాత సంబంధికులకు తెలియజేయడం ద్వారా దానికి సరైన ధనం పొందే అవకాశం ఉంటుంది.































