చపాతీలు కాసేపటికే గట్టిపడుతున్నాయా? ఇలా ట్రైచేయండి.. 24 గంటల పాటు చెక్కుచెదరవు

పాతీ మృదువుగా ఉండాలంటే మొదటగా చపాతీ పిండి తీసుకోండి. అందులో నీటిలో పాటు కొన్ని పాలను, ఒక చెంచా నూనె లేదా నెయ్యిని వేసుకోండి. వీటిని యాడ్‌ చేయడం ద్వారా పిండి మారుతుంది.


పాలలో ఉండే ప్రోటీన్లు తేమను పట్టుకుంటాయి, అయితే కొవ్వు గ్లూటెన్ తంతువులను కప్పివేస్తుంది కాబట్టి అవి త్వరగా గట్టపడవు.

మీరు పిండి పిసికేటప్పుడు తర్వాత వెంటనే వాటిని గుండ్రంగా చుట్టేయకండి. ఒక తడి గుడ్డ తీసుకొని పిండిని దానిపై 20 నుండి 30 నిమిషాలు ఉంచడం వల్ల దానిలోని గ్లూటెన్ విశ్రాంతి పొందుతుంది అది నీటిని పూర్తిగా గ్రహిస్తుంది. దీనివల్ల పిండి మృదువగా మారీ ఈజీగా సాగుతుంది. దీని వల్ల మనం చపాతీని పెనంపై వేసినప్పుడూ చక్కగా కాలుతుంది.

పెనంపై రోటీ ఉబ్బినప్పుడు, దానిలో ఆవిరి పొరలను నింపుతుంది. ఇది మృదుత్వాన్ని లాక్ చేస్తుంది. కాబట్టి పెనంపైనుంచి చపాతీని త్వరగా తీసేస్తే అది ఆరిపోతుంది. అలా అని ఎక్కువ సమయం కూడా ఉంచకండి. అలా చేస్తే చపాతీ మాడి పోతుంది. రెండు వైపులా బంగారు రంగు మచ్చలు, బ్రెడ్ బెలూన్లు మంచిగా కనిపించినప్పుడు చపాతీని పెనంపై నుంచి తీసేయండి.

అలా పెనం పై నుంచి తీసిన చపాతీలను బయట పెట్టకుండా.. శుభ్రమైన కాటన్ క్లాత్‌లో పెట్టండి, ఇది చపాతీ త్వరగా ఎండిపోకుండా అదనపు ఆవిరిని గ్రహిస్తుంది. ఇప్పుడు వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి.

ఇలా చేడం వల్ల మనం చేసిన చపాతీలు గంటల తరబడి మృదువుగా ఉంటాయి. వీటిని మీరు లంచ్‌బాక్స్‌ లేదా.. ఎటైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు తీసుకెళ్లొచ్చు. అప్పుడు ఇవి గట్టిపడకుండా మొత్తగా మృదువుగా ఉంటాయి. వీటిని ఉదయం చేసి మరుసటి రోజు వరకు తినవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.