బాబోయ్ ఇదో భయానక నది.. ఈ నీటిని తాకడానికి కూడా జంకుతున్న జనాలు..! కారణం ఏంటంటే

త్తరప్రదేశ్‌లో ఒక నది నీటిని ముట్టుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆ నది పేరు కర్మనాశ. ఈ నది అంటే ప్రజలకు ఎంత భయం అంటే దాహంతో ప్రాణం పోతున్నా కూడా దాని నీళ్లు తాగడానికి దగ్గరికి వెళ్ళరు.


కనీసం వంట చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగించరు. కర్మనాశ నది గంగా నదికి ఉపనది. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పుట్టి, ఉత్తరప్రదేశ్, బీహార్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది దాని మూలం కారణంగా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ‘కర్మ’, ‘విధ్వంసం’ అనే రెండు పదాలను కలిపి కర్మాంశ అని ఈ నదికి పేరు పెట్టారు.

ఈ నది బీహార్, ఉత్తరప్రదేశ్‌లను విభజిస్తుంది. దీనికి ఒక వైపు ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర, చందౌలి, వారణాసి, ఘాజీపూర్ ఉన్నాయి. ఇది బక్సర్ సమీపంలో గంగానదిలో కలుస్తుంది. ఈ నది మీ సకల శుభాలను, పనులను నాశనం చేస్తుందని, ఈ నది నీటిని తాకడం ద్వారా మీ అన్ని పనులు చెడిపోతాయని నమ్ముతారు. కర్మాంశ నది గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కర్మాంశ నది గురించి పౌరాణిక నమ్మకాలు ఏంటంటే..

ప్రసిద్ధ కథ ప్రకారం, హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రతుడు తన శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరికను తన గురువు వశిష్ఠుడికి వ్యక్తం చేశాడు. కానీ అతను నిరాకరించాడు. దీంతో కోపంగా ఉన్న సత్యవ్రతుడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్తాడు. అతని తన కోరికను వ్యక్తం చేశాడు. గురు వశిష్ఠుడితో శత్రుత్వం కారణంగా విశ్వామిత్రుడు సత్యవ్రతుడి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. కఠోర తపస్సు చేసిన విశ్వామిత్రుడు సత్యవ్రతుడిని తన శరీరంతో స్వర్గానికి పంపాడు. కానీ, అతను భూమికి, స్వర్గానికి మధ్య చిక్కుకుంటాడు. అందుకే అతన్ని త్రిశంకుడు అని పిలుస్తారు.

ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.. దేవతలకు, విశ్వామిత్రుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సత్యవ్రతుడు భూమికి, ఆకాశానికి మధ్యలో వేలాడుతుంటాడు.. ఆ సమయంలో అతని నోటి నుండి లాలాజలం కారడం ప్రారంభమైంది. ఈ లాలాజలం నది రూపంలో భూమిపై పడిందట. దాంతో ఆగ్రహించిన వశిష్ఠ మహర్షి సత్యవ్రతను చండాలుడిగా మారమని శపించాడు. ఆ తరువాత ఈ నది కూడా శపించబడింది. ప్రజలు ఇప్పటికీ దీనిని నమ్ముతారు. అందుకే ఈ నదికి దూరంగా ఉంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.