వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంట నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా లో మెగా అభిమానులు ఎక్కడ చూసిన ఈ విషయం పై ట్వీట్లు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళ తర్వాత మెగా ఫ్యామిలీ లో పుట్టిన మగబిడ్డ కావడం తో సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ విషయం తెలుసుకొని, తన షూటింగ్ కార్యక్రమాలను మధ్యలోనే ఆపేసి, నేరుగా హాస్పిటల్ కి తన సతీమణి సురేఖ తో కలిసి వెళ్లి బిడ్డని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ఆనందంలో బిడ్డని ఎత్తుకొని ఆడుకుంటున్న ఫోటోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని మనం చూడొచ్చు.
ఆయన మాట్లాడుతూ ‘మా కుటుంబం లోకి అడుగుపెట్టిన ఈ చిట్టి తండ్రికి స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా నేను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నాగబాబు, పద్మజ తాత, నాన్నమ్మ గా ప్రమోట్ అయ్యినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నారి కి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సొంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారి కి మీ ప్రేమ అభిమానులు కూడా దక్కాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ని చూసి మెగా అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి కళ్ళలో ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు. తన కుటుంబ సభ్యుల విషయం లోనే కాదు, చిరంజీవి బయట వాళ్ళ విషయం లో కూడా ఇంతే ప్రేమ వాత్సల్యం చూపించే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇకపోతే నాగబాబు సంతోషానికి హద్దులే లేకుండా పోయింది.
ఈమధ్య కాలం లో ఆయన కుటుంబం లో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. లావణ్య త్రిపాఠి కోడలుగా అడుగుపెట్టిన వేళా విశేషం కారణంగా నాగబాబు కి ప్రభుత్వం లో MLC పదవి దక్కింది, త్వరలోనే మంత్రి పదవి కూడా దక్కనుంది. అదే విధంగా కూతురు నిహారిక కూడా నిర్మాతగా సక్సెస్ అయ్యింది. కేవలం సినీ కెరీర్ పరంగా కొడుకు వరుణ్ తేజ్ ఒక్కడే సక్సెస్ ని చూడాల్సి ఉంది. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి , ఈ శుభ సమయంలో ఆయనకు అన్ని కలిసి రావొచ్చని, త్వరలోనే ఆయన భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్.

































