గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? అతి తక్కువ వడ్డీకే లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఏవో తెలుసా..?

బ్బు అర్జెంట్‌గా అవసరమైనప్పుడు మనకు టక్కున గుర్తుకొచ్చేది లోన్. వ్యాపారస్థుల నుంచి మొదలు సామాన్యుల వరకు ఎప్పుడో ఓసారి లోన్ తీసుకోవడం కామన్. లోన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి.


అయితే పర్సనల్ లోన్, హోమ్ లోన్ వంటి రుణాలు పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ తప్పనిసరి. కొన్నిసార్లు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా అధిక వడ్డీకి లోన్స్ ఇస్తుంటారు. ఎటువంటి సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా సులభంగా లోన్ ఇచ్చేది గోల్డ్ లోన్. అవును మార్కెట్‌లో బంగారం విలువను బట్టి, బ్యాంకులు 65 నుంచి 75 శాతం వరకు లోన్ ఇస్తాయి. ఈ లోన్‌ను 3 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు, లోన్ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. చాలా బ్యాంకులు 0.50% నుంచి 1% వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి.

తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అందించే బ్యాంకులు:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : ఈ బ్యాంకు 8.35శాతం నుంచి వార్షిక వడ్డీ వసూల్ చేస్తుంది. లోన్ అమౌంట్, కాలపరిమితిని బట్టి వడ్డీ విధిస్తుంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: వార్షిక వడ్డీ రేటు 7.90శాతం నుంచి 8.90శాతం వరకు ఉంటుంది. ఇది చాలా తక్కువ వడ్డీ రేటుగా చెప్పవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఏడాదికి 8.75శాతం నుంచి 9.05శాతం వార్షిక వడ్డీ రేటును విధిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 8.30శాతం నుంచి ప్రారంభమవుతుంది. తీసుకున్న మొత్తం, చెల్లించే కాలపరిమితిని బట్టి వడ్డీ మారుతుంది.

ఫెడరల్ బ్యాంక్: ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 8.50శాతం నుంచి మొదలవుతుంది.

యూకో బ్యాంక్: వార్షిక వడ్డీ రేటు 8.75శాతం నుంచి 9.15శాతం వరకు ఉంటుంది.

కెనరా బ్యాంక్: 8.75శాతం నుంచి వడ్డీ రేటు మొదలవుతుంది.

ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లు:

యాక్సిస్ బ్యాంక్: 8.75శాతం నుంచి 17శాతం వరకు.

ఐసీఐసీఐ బ్యాంక్: 9.15శాతం నుంచి అత్యధికంగా 18శాతం వరకు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 9.30శాతం నుంచి 17.86శాతం వరకు.

బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.40శాతం వడ్డీని వసూలు చేస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్: 10.56శాతం వడ్డీ.

ఇండస్ఇండ్ బ్యాంక్: 10.83% నుంచి 16.28% వరకు.

ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు, గోల్డ్ లోన్ ఒక సురక్షితమైన, వేగవంతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. తక్కువ వడ్డీతో ఈ రుణాలు అందించే బ్యాంకులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లోన్ తీసుకునే ముందు, అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలను సరిపోల్చుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.