బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరో గా నటించిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘కిష్కింధపురి'(Kiskindhapuri Movie) బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని విజయవంతంగా థియేటర్స్ లో రన్ అవుతుంది.
మిరాయ్ చిత్రం విడుదలైన రోజునే ఈ సినిమా విడుదల కావడంతో ఓపెనింగ్ వసూళ్లు చాలా తక్కువగా వచ్చాయి. అయ్యో పాపం, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ ఇంత దారుణంగా వచ్చాయేంటి, ఈ సినిమా కూడా బెల్లంకొండ కి ఫ్లాప్ గా మిగలనుందా వంటి సందేహాలు విశ్లేషకుల్లో కలిగాయి. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న డీసెంట్ స్థాయి వసూళ్లను చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. మొదటి వారం పూర్తి అయ్యేలోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, చాలా కాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో ఒక సూపర్ హిట్ గా నిలవబోతుంది ఈ చిత్రం.
ఇలాంటికి హారర్ థ్రిల్లర్ చిత్రాలను థియేటర్స్ లో చూస్తేనే అసలు సిసలు మజా. కానీ ఈమధ్య కాలంలో అత్యధిక శాతం మంది ఆడియన్స్ సినిమాలను ఓటీటీ లో చూడడం అలవాటు చేసుకున్నారు. చిన్న సినిమాలు బాగున్నప్పటికీ, ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్ కి వచ్చేసారు. అలాంటి ఆడియన్స్ కోసం ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక శుభ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విషయం లోకి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ 5 సంస్థ మంచి రేట్ కి కొనుగోలు చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రం ‘భైరవం’ చిత్రాన్ని కూడా ఈ సంస్థనే కొనుగోలు చేసింది. వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి.
అంటే వచ్చే నెల 12 వ తేదీ లోపు ఈ సినిమాని మనం జీ5 యాప్ లో చూడొచ్చు అన్నమాట. అయితే ఏ మాటకు ఆ మాట, ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తేనే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మన ఇంట్లో కూర్చొని చూస్తే ఆ అనుభూతి కలగదు అనేది వాస్తవం. కాబట్టి థియేటర్స్ కి వెళ్లి ఈ చిత్రాన్ని చూడండి. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రమిదే. హారర్ పేరుతో కుళ్ళు కామెడీ సినిమాలు ఈమధ్య కాలం లో ఎక్కువ అయిపోతున్నాయి. అలాంటి కుళ్ళు కామెడీ ఈ చిత్రం లో మనకు ఎక్కడా కనిపించదు. అనేక సందర్భాల్లో భయపడి సీట్స్ మీద నుండి లేస్తాము. అటువంటి భయానక సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉన్నాయి. కొనే టికెట్ కి న్యాయం చేసే ఇలాంటి సినిమాలను అసలు మిస్ కాకండి.
































