గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. ఈ ఒక్క టాబ్లెట్ మీ దగ్గర ఉంచుకోండి

 ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు.


మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్‌ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం దెబ్బతిని ఎంతోమంది హఠాత్తుగా గుండె పోటు బారినపడుతున్నారు. అదీ 30ల్లో, 40ల్లోనే. ఈ నేపథ్యంలో జీవనశైలికి ప్రాధాన్యం పెరుగుతోంది. దీన్ని మెరుగుపరచుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమనేది అసాధ్యం. గుండె పోటు మాత్రమే కాదు, అకస్మాత్తుగా గుండె స్తంభించటమూ (కార్డియాక్‌ అరెస్ట్‌) శాపంగా మారుతోంది. నలభై ఏళ్లలోపు వాళ్లు అకస్మాత్తుగా గుండె జబ్బుతో మరణిస్తున్నారు.

కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు చూపకుండానే గుండెపోటు వస్తుంది. ఈ ఎటాక్ జరిగితే 15 నిమిషాల కన్నా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. గుండె నొప్పి వచ్చిందని నిర్ధారణ జరిగాక “ఆస్పిరిన్ ట్యాబ్లెట్” తీసుకోవడం వల్ల మంచిదట. అయితే ఇది అందరికీ ఒకే విధంగా వేయొద్దని నిపుణులు చెబుతున్నారు.. పిల్లలకైతే 324 మిల్లీ గ్రాముల ట్యాబ్లెట్ ఇవ్వాలట. పెద్దవాళ్లకి అయితే 325 మిల్లీ గ్రాముల ట్యాబ్లెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కాసేపు గుండె ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదివరకే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారిలో కొంతమందికి నైట్రోగ్లిజరిన్‌ని వైద్యులు సూచిస్తారు. కాబట్టి దానిని కూడా తీసుకోవచ్చు. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే అంశంపై వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.