ఇది రోజుకొకటి తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే

భారతీయ సంప్రదాయ వంటకాలలో లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం తీపి వంటకం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక పదార్థాల సమ్మేళనం.


ముఖ్యంగా నల్ల నువ్వుల లడ్డు ఒక శక్తివంతమైన, రుచికరమైన, ఔషధ గుణాలు కలిగిన వంటకం. దీనిని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగల సమయంలో లేదా చలికాలంలో తయారు చేస్తారు.

నల్ల నువ్వులు, బెల్లం ప్రధానంగా వాడే ఈ లడ్డును తయారు చేయడం చాలా సులభం. ఈ లడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇది ముఖ్యంగా వృద్ధులలో, మహిళలలో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ఈ లడ్డు తక్షణ శక్తిని అందించి, శరీరంలో వేడిని పెంచుతుంది చలికాలంలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల లడ్డు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు

నల్ల నువ్వులు-250గ్రాములు

ఎండు కొబ్బరి పొడి-100గ్రాములు

యాలకలు-4

బెల్లం-150గ్రాములు

నెయ్యి-కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా ఒక మందపాటి అడుగు ఉన్న పాన్ పొయ్యి మీద తక్కువ మంటపై పెట్టాలి. అందులో ఒక కప్పు నల్ల నువ్వులు వేసి సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.

-నువ్వులు వేగుతున్నప్పుడు వాటిలో తేమ పోయి, కాస్త రంగు మారి, చిటపట శబ్దం రావడం మొదలవుతుంది. అవి మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అధికంగా వేయించకూడదు, లేదంటే లడ్డు చేదుగా మారుతుంది.

-నువ్వులు సరిగ్గా వేగిన తర్వాత వాటిని వెంటనే ఒక ప్లేట్‌ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

-మీరు వేరుశనగ పప్పు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తే, వాటిని కూడా ఇదే పాన్‌ లో వేసి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

తీ-సుకున్న బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసుకోవాలి లేదా తురుముకోవాలి. బెల్లంలో ఏమైనా చెత్త లేదా మట్టి ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి కొద్దిగా నీటిలో కరిగించి, వడకట్టి, మళ్లీ పాకం వచ్చే వరకు ఉడికించుకోవచ్చు.

-అయితే ఈ రెసిపికి శుభ్రమైన, పొడి బెల్లం ఉపయోగిస్తే దాన్ని నేరుగా నువ్వులతో కలిపి మిక్సీలో వేయవచ్చు. ఇదే సులభమైన సాంప్రదాయిక పద్ధతి.

-పూర్తిగా చల్లారిన నల్ల నువ్వులు, తురిమిన బెల్లం లేదా పొడి బెల్లం మిక్సీ జార్‌ లో తీసుకోవాలి. దీంతో పాటు యాలకుల పొడి కూడా వేయాలి.

-మిక్సీని ఆపి ఆపి వేస్తూ మెత్తగా పొడి చేయాలి. మిక్సీని ఒకేసారి ఎక్కువ సేపు నడపకూడదు, అలా చేస్తే నువ్వుల నుండి నూనె విడుదలై మిశ్రమం పేస్ట్ లాగా మారుతుంది.

మిశ్రమం కొంచెం పలుకుగా, లడ్డు కట్టడానికి వీలుగా ముద్దలా మారేంత వరకు మాత్రమే గ్రైండ్ చేయాలి.

-తయారైన మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. మిశ్రమం లడ్డు కట్టడానికి చాలా పొడిగా ఉంటే ఒక టీస్పూన్ కరిగించిన నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి బాగా కలపాలి.

–ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, నొక్కిపెట్టి, గుండ్రంగా లడ్డులా చుట్టాలి.

తయారు చేసిన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకుంటే ఇవి కనీసం 10 నుండి 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.