ప్రతిరోజు మనం తినే ఆహారం మన శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. అయితే ఆహారంలో మంచి పోషకాహారం తినడం అనేది ప్రధానం. ముఖ్యంగా మాంసాహారం తినేవారు మంచి పోషకాలతో కూడిన బలవర్ధకమైన ఆహారం తినాలంటే తలకాయ కూరను తినాల్సిందే.
తలకాయ కూరను మేక లేదా గొర్రెల తలలతో వండుతారు.
తలకాయ కూరలో పోషకాలు
తలకాయ కూరలో ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మంచి పోషకాహారంగా తలకాయ కూరను చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రాంతాలలో తలకాయ కూరను చాలా ఇష్టంగా తింటారు. తలకాయ కూరను వండడానికి గొర్రె లేదా మేక తలకాయ, గరం మసాలాలు, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరియాల పొడి వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.
తలకాయ కూరతో ఆరోగ్య ప్రయోజనాలు
తలకాయ కూర తింటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కండరాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. తలకాయ కూర నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు అందాలి. తలకాయ కూర లో ఉండే పోషకాలు నరాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
ఎముకలకు, కండరాలకు తలకాయకూర ది బెస్ట్
తలకాయ కూరలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన కండరాలకు శక్తినిస్తుంది. కండరాల నిర్మాణం మరమ్మతు మెరుగుదల మొదలైన వాటికి కావలసిన ప్రోటీన్ ను తలకాయ కూర అందిస్తుంది.తలకాయ కూరలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. తలకాయ కూర శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది.
తలకాయ కూరతో ఈ ప్రయోజనాలు కూడా
మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తలకాయ కూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే తలకాయ కూరను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తలకాయ కూర ఆరోగ్యానికి మంచిదని భావించి దానిని అతిగా తీసుకుంటే ఆరోగ్య అనర్ధాలు వస్తాయి.
తలకాయ కూర విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తలకాయ కూర లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన శరీర బరువును పెంచుతుంది. కనుక బరువు తగ్గాలని భావించేవారు తలకాయ కూరను తక్కువగా తింటేనే మంచిది. ఏది ఏమైనప్పటికీ తలకాయ కూర ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలంటే కచ్చితంగా పరిమితంగానే దానిని తినాలి.
































