దసరా, దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలొచ్చాయంటే చాలు.. ఆన్లైన్లో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి ఈ కామర్స్ సంస్థలు. ఇటీవలే దసరా సందర్భంగా..
బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగించిన ఫ్లిప్ కార్ట్.. ఇప్పుడు మరో భారీ సేల్‌తో వస్తోంది. “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 11 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా.. ప్లస్, బ్లాక్ సభ్యులకు ఒకరోజు ముందు నుంచే.. అంటే అక్టోబర్ 10 నుంచే ఆఫర్లను అందుబాటులో ఉంచనుంది.
“బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025″లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్స్, స్మార్ట్ వాచీలు, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, హోమ్ అప్లయన్సెస్ పై కూడా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు ఫ్లిప్ కార్డ్ రెడీ అయింది. ఆపిల్, శామ్ సంగ్, సోనీ, వన్ ప్లస్, షియోమీ, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన మొబైల్స్, ల్యాప్ టాప్స్ పై స్పెషల్ ఆఫర్లు ఉంటాయని యాజమాన్యం వెల్లడించింది. SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు.. ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసేవారికి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అడిషినల్ రివార్డులు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వనుంది. కాగా.. “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” ఎప్పటి వరకు ఉంటుందన్న దానిపై ఇంకా ప్రకటన చేయలేదు.
































