కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త వినిపించే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)లో 3 శాతం పెంపుదలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
ఈ పెంపు తర్వాత, డిఎ, డిఆర్ ఇప్పుడు 58 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డిఎ, డిఆర్‌ను పెంచుతుంది, మొదటి పెంపు జనవరి 1 నుండి, మరొకటి జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది అని చెప్పవచ్చు. జనవరి ఒకటో తేదీ 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పవచ్చు. ఎనిమిదో పే కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎనిమిదో పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి, ఇదిలా ఉంటే 8వ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. అయితే గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని కనీసం 2.86 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.
వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లపై బేసిక్ జీతం, పెన్షన్ పెంపు ఎంత ఉంటుందంటే..?
1.8 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త కనీస ప్రాథమిక జీతం – రూ. 32,400
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 16,200
1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం – రూ. 34,560
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 17,280
2.00 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం – రూ. 36,000
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 18,000
2.08 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం – రూ. 37,440
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 18,720
2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం – రూ. 46,260
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 23,130
2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే..
ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం – రూ. 51,480
పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ – రూ. 25,740
































