గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత 2023లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం విశేషం.
మెగా కోడలు ఉపాసన 2023 జూన్ 20 పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆ పాపకు క్లిన్‌కారా అని నామకరణం చేశారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ పాప పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ముఖాన్ని దాచి పెడుతూ వస్తున్నారు. మెగా అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ క్లీన్ కారాను చూపించడం లేదు. దీంతో ఆ చిన్నారి మొదటి పుట్టిన రోజుకైనా చూపిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ అది కూడా జరగలేదు.
ఆ పాప పుట్టి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ ముఖాన్ని చూపించడం లేదు. తాజాగా, ఈ విషయంపై ఓ వేడుకలో పాల్గొన్న మెగా కోడలు ఉపాసన స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ”ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అలాగే కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎయిర్‌పోర్టుకి వెళ్లేటప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం.
చెప్పాలంటే అది పాపకు తల్లిదండ్రులుగా నాకు చరణ్‌కి పెద్ద పని. అయినప్పటికీ మేము కరెక్ట్ పని చేస్తున్నామా? లేదా అనేది మాకు తెలియదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో మాత్రం నేను నా భర్త చరణ్ సంతోషంగానే ఉన్నాం. ఇప్పట్లో అయితే క్లీన్ కారా ముఖాన్ని చూపించాలని అనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
































