Sun – సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు ?

www.mannamweb.com


సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు ?

సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలు. ప్రతినిత్యం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలను ఆచరించి ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి నమస్కరిస్తే సకల పాపాలు నశించి దుఃఖాలు దూరమవుతాయనేది మన ప్రగాఢ విశ్వాసం.

ఇది కేవలం విశ్వాసమే కాదు, వైజ్ఞానికంగా సైతం నిరూపితమైన అంశం. ఇలా ఆచరిస్తూ సంపూర్ణారోగ్యంగా వున్నవారిని మనం చూస్తుంటాం కూడా. సూర్య భగవానుడిని పూజించే పాండవులు ‘అక్షయ పాత్ర’ను పొందారు. సత్రాజిత్తు ‘శమంతకమణి’ని సాధించాడు. సూర్యుడి రథానికి ఒకే అశ్వం ఉంటుంది . దానిపేరు ‘సప్త’. ఒకే చక్రం వుంటుంది. అదే కాలచక్రం. ఆదిత్యుడు 12 మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో 12 రాశులలో సంచరిస్తూ వుంటాడు.

ఆ పేర్లేంటో ఒకసారి చూద్దాం.

చైత్రంలో ‘ధాత’, వైశాఖంలో ‘అర్యముడు’, జ్యేష్టంలో ‘మిత్రుడు’ , ఆషాఢంలో ‘వరుణుడు’, శ్రావణంలో ‘ఇంద్రుడు’, భాద్రపదంలో ‘వివస్వంతుడు’, ఆశ్వయుజంలో ‘త్వష్టా’, ‘కార్తీకంలో ‘విష్ణువు’, మార్గశిరంలో ‘అంశుమంతుడు’, పుష్యంలో ‘భగుడు’, మాఘంలో ‘పూషా’, ఫాల్గుణంలో ‘పర్జన్యుడు’ పేరుతో సంచరిస్తుంటాడు.