ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఫిలిప్పీన్స్‌లో భారీ భూక​ంపం సంభవించింది. మిండనోవా ద్వీపంలో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4తో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.


భూకంపం నేపథ్యంలో పిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భూకంపం కారణంగా భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.