సండే స్పెషల్ “కరివేపాకు చికెన్ ఫ్రై” – ఈ సారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి

సండే అనగానే చాలా ఇండ్లలో నాన్​వెజ్ వండుతారు. ఇందులో చికెన్, మటన్, చేప, రొయ్యలతో వివిధ రకాల వంటలు చేసి భుజిస్తారు. వీటిలో చికెన్​తో చాలా సులువుగా నిమిషాల్లోనే రెసిపీలు చేయోచ్చు. అయితే దీనితో ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఈసారి కరివేపాకు పొడితో చికెన్ ఫ్రై చేశారంటే అద్దిరిపోతుంది. అంతే కాకుండా పిల్లలు, పెద్దలకూ ఇలా చేసి పెట్టారంటే ఇంకోసారి ఇదే చేయమని అడుగుతారు! మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ – 1 కేజీ
  • పచ్చిమిర్చి – 10
  • వెల్లుల్లి రెబ్బలు – 10
  • కొత్తిమీర – కొంచెం
  • అల్లం – కొద్దిగా
  • జీలకర్ర – 3 చెంచాలు
  • ఉల్లిపాయలు – 2
  • లవంగాలు – 10
  • ఎండుమిర్చి – 4
  • సోంపు – 1 చెంచా
  • జాపత్రి – కొద్దిగా
  • యాలకులు – 5
  • దాల్చిన చెక్క – కొద్దిగా
  • మిరియాలు – 1 చెెంచా
  • ధనియాలు – 2 చెంచాలు
  • పసుపు – అర చెంచా
  • ఉప్పు – ఒకటిన్నర చెంచా
  • తయారీ విధానం :

    • ముందుగా గిన్నెలో కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని చిన్నచిన్న ముక్కలుగా కట్​చేసి పక్కనుంచాలి.
    • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆరు చెంచాల ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత వీటిని ప్లేట్​లో తీసుకోవాలి.
    • ఇదే కడాయిలో ఎండుమిర్చిని వేసి వేయించి తీసుకోవాలి. అదేవిధంగా కడాయిలో కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
    • ఆనియన్స్ వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అనంతరం చికెన్ వేసి కలపాలి. అలాగే అర చెంచా పసుపు, ఒకటిన్నర చెంచా ఉప్పు వేసి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి రెండు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.
    • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి చికెన్ మిశ్రమాన్ని ఆరు నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. అదేవిధంగా ఒక గ్లాసు నీళ్లు పోసి కలపాలి. అనంతరం మూతపెట్టి 10 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
    • మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్​ పెట్టుకొని మసాలా దినుసులను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టాలి. అనంతరం పొడిని ప్లేట్​లో వేసుకోవాలి.
    • ఇప్పుడు చికెన్ మిశ్రమంలో రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి.
    • చివరన కొంచెం కొత్తిమీర వేసి నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి.
  • ఇక అంతే ఘుమఘుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై మీ ముందుంటుంది! వేడివేడి అన్నంలో కరివేపాకు చికెన్ ఫ్రై వేసి తిన్నారంటే ఆహా అనాల్సిందే.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.