తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. ఏ పండుగ జరిగిన సరే తెలంగాణలో మద్యం తాగడం మాత్రం పక్కా. ఎవరైనా చనిపోయిన లేదా ఎవరైనా జన్మించిన, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే కచ్చితంగా దావత్ ఏర్పాటు చేస్తారు.
ఇందులో భాగంగానే వచ్చిన చుట్టాలకు మద్యం తాగించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లో జరిగిన కూడా ఆ మద్యం ఏరులై పారుతుంది. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు కచ్చితంగా మద్యం సేవిస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరికొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు.
Shock for drug addicts Wine Shop open only from 4 pm to 9 pm
ప్రస్తుతం మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో టైమింగ్స్ పై సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు మాత్రమే నడిపించాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఉండాలని అలాగే అక్కడ కూర్చుని తాగడానికి సిట్టింగుకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వబోనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

































