హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేత .. పోస్టాఫీస్ నుంచి కేవలం రూ.755కే రూ.15 లక్షల బీమా కవరేజ్

దేశంలో ఆరోగ్య బీమాపై ప్రజల అవగాహన పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది.


కానీ తాజాగా ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసి, హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ప్రజల్లో బీమా పథకాలపై ఆసక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

తక్కువ ప్రీమియంతో భారీ కవరేజ్

ప్రభుత్వరంగ సంస్థ ఇండియా పోస్ట్ ఇప్పుడు ప్రజల కోసం తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజ్ కలిగిన బీమా పథకాలను అందిస్తోంది. కేవలం వందల్లో ప్రీమియం చెల్లించి లక్షల్లో కవరేజ్ పొందే అవకాశాన్ని పోస్టల్ శాఖ కల్పిస్తోంది.

రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షల బీమా కవరేజ్

ఈ స్కీమ్‌లో కేవలం రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది.

ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లింపు

శాశ్వత అంగవైకల్యం లేదా పక్షవాతం వచ్చినా పూర్తి బీమా మొత్తం

ఆసుపత్రి చికిత్స ఖర్చులకు రూ.1 లక్ష వరకు రీయింబర్స్‌మెంట్

సాధారణ వార్డులో రోజుకు రూ.1,000, ఐసీయూలో రోజుకు రూ.2,000 చెల్లింపు

చేయి లేదా కాలు విరిగితే రూ.25,000 బెనిఫిట్

పిల్లల విద్య కోసం రూ.1 లక్ష, వివాహం కోసం మరో రూ.1 లక్ష అదనంగా

రూ.399 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల బీమా కవరేజ్

తక్కువ ప్రీమియం చెల్లించే వారికి ఈ స్కీమ్ మరింత సరైనది.

ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లింపు

ఆసుపత్రి చికిత్స ఖర్చులకు రూ.60 వేల వరకు కవరేజ్

ఔట్‌పేషెంట్ ట్రీట్‌మెంట్‌కు రూ.30 వేల వరకు సహాయం

పిల్లల విద్య కోసం గరిష్టంగా రూ.1 లక్ష వరకు చెల్లింపు

ఆసుపత్రిలో చేరితే రోజుకు రూ.1,000 (గరిష్టంగా 10 రోజుల వరకు)

అంత్యక్రియల ఖర్చులకు రూ.5 వేల వరకు సహాయం

ప్రమాదం జరిగినప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులకు రూ.25 వేల వరకు చెల్లింపు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.