మనది కానీ భూమి గురించి మనం పట్టించుకోకపోవచ్చు. కానీ అది మనది అని తెలిసిన తర్వాత ఒక అంగుళం భూమి కూడా విడిచి పెట్టే అవకాశం ఉండదు. కేవలం ఒక్క అడుగు కోసం చాలామంది యుద్ధం చేసిన సంఘటనలు ఉన్నాయి. అలాగే కొన్ని దేశాలు భూభాగంలో కాకుండా సముద్రమార్గంలో ఉన్న తమదైన ప్లేసును కాపాడుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తుంటాయి. అలా జపాన్ దేశం తమ భూభాగానికి 1700 కిలోమీటర్ల దూరంలో సముద్ర మార్గంలో ఉన్న చిన్న ప్రదేశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా దీనిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఖర్చులు చేస్తోంది. ఇంతకీ ఈ భూభాగం స్టోరీ ఏంటి?
జపాన్ దేశానికి ఆనుకొని ఉన్న సముద్రంలో 1700 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశం ఉంది. దానిని Okinitorosima అని అంటారు. ఇది కేవలం కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. అయితే దీనిని జపాన్ తమ ద్వీపంగా పేర్కొంటుంది. ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ప్రకారం ఒక దేశం దీపాన్ని కలిగి ఉంటే దాని చుట్టూ ఉన్న 200 నాటికల్ మైళ్ళ విస్తీర్ణంలో ప్రత్యేక ఆర్థిక మండలి కలిగి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆ దేశం సంబంధిత భూభాగం లో లభించే ఖనిజాలను, వనరులను పొందే హక్కు ఉంటుంది. జపాన్ కు సమీపంలో ఉన్న Okinitorosima చుట్టూ 4,000 చదరపు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ భూభాగంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జపాన్ భావిస్తోంది. అందుకే ఈ చిన్న భూభాగాన్ని కాపాడుతూ వస్తుంది. అయితే సముద్రంలో వచ్చే ఆటుపోట్ల కారణంగా ఇవి మునిగిపోతుంది. కానీ ప్రత్యేకంగా దీని చుట్టూ కాంక్రీట్ గోడలు, ఉక్కు బ్రేక్ వాటర్ వంటి నిర్మాణాలు చేస్తోంది. ఇలా దీనిని కాపాడడానికి కోసం విలియం డాలర్ల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 2016లో ఒక అబ్జర్వేషన్ పోస్టు ప్రకారం దీని నిర్మాణానికి 13 బిలియన్ ఎన్ లు ఖర్చు చేసినట్లు సమాచారం.
అయితే జపాన్ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా జపాన్ కు సమీపంలో ఉన్న తైవాన్ మధ్య పశ్చిమ పసిఫిక్ లో ఉంది. అయితే Okinitorosima పై హక్కులు పొందేందుకు తీవ్ర పోరాటాలు చేస్తోంది. కానీ ఇతర దేశాలకు వెళ్లకుండా జపాన్ ప్రత్యేకంగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతోంది. UNCLOS ప్రకారం ఇక్కడ మానవ నివాసానికి అర్హత లేకున్నా కూడా.. ఈ ప్రాంతంలో అరుదైన ఖనిజాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఇరుదేశాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మరో దేశమైన చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
































