ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ వ్యాధిగా ఫ్యాటీ లివర్ మారింది. తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 2 మిలియన్ల మంది కాలేయ వ్యాధితో మరణిస్తున్నారు.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో పాటు ఆల్కహాల్ తీసుకోని వారిలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నాన్-వెజ్, అధిక నూనె లేదా జంక్ ఫుడ్ తినడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ.. కాలేయానికి అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ఒక రహస్య పదార్థం ఉంది.
కాలేయానికి అత్యంత ప్రమాదకరమైనది ఇదే
అమెరికాకు చెందిన థైరాయిడ్, PCOS ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ అడ్రియన్ స్నాజ్డర్ ప్రకారం.. కాలేయానికి అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఈ ఫ్రక్టోజ్ అనే చక్కెర రకం పారిశ్రామికంగా, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, తీపి పానీయాలలో దాగి ఉంటుంది.
ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లేదా ఫ్రక్టోజ్ ఎక్కువగా కనిపించే ఆహారాలు:
- ప్రాసెస్ చేసిన ఆహారాలు
- తీపి పానీయాలు
- కుకీలు, క్యాండీలు
- తృణధాన్యాలు
- శీతల పానీయాలు
- సాస్‌లు
- కొన్ని రకాల పెరుగు
ఈ ఆహారాలను అధికంగా తీసుకున్నప్పుడు, అందులోని ఫ్రక్టోజ్ కాలేయంలోకి వెళ్లి నేరుగా కొవ్వుగా మారుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
ఫ్రక్టోజ్ కాలేయాన్ని ఎలా దెబ్బతీస్తుంది?
పండ్లు, కూరగాయలలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ కంటే సుక్రోజ్, అధిక-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటి పారిశ్రామిక ఫ్రక్టోజే కాలేయానికి ప్రధాన హాని చేస్తుంది.
పేగుల ఆరోగ్యంపై ప్రభావం: మనం ఫ్రక్టోజ్ తిన్నప్పుడు, అది ప్రేగులలోకి ప్రవేశిస్తుంది. అక్కడ, ఇది పేగు లైనింగ్, పేగులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.
కొవ్వు ఉత్పత్తి: ఇది కొవ్వును ఏర్పరిచే పదార్థాల శోషణను పెంచుతుంది, ఇవి నేరుగా కాలేయానికి చేరుతాయి.
కొవ్వు పేరుకుపోవడం: గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే అధిక స్థాయిలో ఫ్రక్టోజ్, అసిటేట్, బ్యూటిరేట్ వంటివి కాలేయంలో కొవ్వును పెంచుతాయి. ఇది కాలేయం దెబ్బతినడానికి మరియు చివరకు ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది.
మంట: అధిక ఫ్రక్టోజ్ శరీరంలో మంటను కూడా కలిగిస్తుంది. ఇది కాలేయ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది.
మీరు ఏం చేయాలి?
మీరు తదుపరిసారి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని లేదా చక్కెర పానీయాన్ని ఎంచుకున్నప్పుడు.. అందులోని అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మీ కాలేయానికి ఎంత ప్రమాదకరమో గుర్తుంచుకోవాలి. మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలు తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలకు దూరంగా ఉండండి అని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































