ఈ ఏడాది థియేటర్స్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నిన్ననే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, నెట్ ఫ్లిక్స్ లో అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది.
కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం సినీ ఇండస్ట్రీస్ కి చెందిన ఆడియన్స్ కూడా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్విట్టర్ మరియు ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేసి డైరెక్టర్ సుజిత్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్ సన్నివేశాలు పడలేదని, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని విధాలుగా వాడుకున్నారని కొనియాడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే నెట్ ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియో ని విడుదల చేసింది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ పెయింటింగ్ ని దీపాలతో కళాత్మకంగా ఆరెంజ్ చేయించారు. ఈ క్రియేటివిటీ కి పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియో ని మీరు చివర్లో చూడొచ్చు. కానీ కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఇది పవన్ కళ్యాణ్ బొమ్మ లాగా లేదు, నాగార్జున బొమ్మ లాగా ఉంది అంటూ వెటకారం చేశారు. మరికొంతమంది అయితే శ్రీవిష్ణు బొమ్మని గీసి పవన్ కళ్యాణ్ బొమ్మ గీసాము అంటారేంటి అంటూ ఫన్నీ ట్రోల్స్ చేసారు. అలాంటి ఫన్నీ ట్రోల్స్ ని కాసేపు పక్కన పెడితే, ఇలా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక హీరో కి స్పెషల్ ట్రిబ్యూట్ ఇస్తూ ఇప్పటి వరకు ఇండియా లో ఏ హీరో కి కూడా చేయలేదు. అలాంటి అరుదైన ఘటన కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే జరిగింది.
ఇకపోతే ఓజీ ప్రీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా మాట ఇవ్వడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలే కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ద్రుష్టి మొత్తం పాలన పైనే ఉంది. మరో ఏడాది కాలం వరకు ఆయన సినిమా షూటింగ్స్ కి దూరం గా ఉండొచ్చు. ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ లోపు షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
































