Mangoes : వేసవి కాలంలో మనకు సహజంగానే మామిడి పండ్లు చాలా విరివిగా లభిస్తుంటాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి.
ఇక ప్రస్తుతం నడుస్తున్నది వేసవి కాలమే కనుక ఇప్పుడు కూడా మార్కెట్‌లోకి మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే ఇది సీజన్ ప్రారంభమే. కనుక మనం పచ్చి మామిడికాయలను ఎక్కువగా చూడవచ్చు. అదే ఇంకొన్ని రోజులు పోతే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అయితే మామిడి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి.
Mangoes
మామిడి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈ పండ్లలో ఉండే పోషకాలు మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. కనుక మామిడి పండ్లను ఈ సీజన్‌లో అసలు మిస్ చేసుకోవద్దు.
అయితే మామిడి పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? ఎప్పుడు తినకూడదు ? అనే విషయం చాలా మందిని అనుమానాలకు గురి చేస్తుంటుంది. ఇక ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. మామిడి పండ్లను రోజులో ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తినవచ్చు. సాయంత్రం తరువాత మామిడి పండ్లను తినరాదు. ఎందుకంటే ఈ వీటిల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక ఈ పండ్లను సాయంత్రం తరువాత తింటే వీటి ద్వారా లభించే క్యాలరీలు ఖర్చు కావు. ఫలితంగా శరీరంలో కొవ్వు చేరుతుంది. కనుక మామిడి పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మాత్రమే అలవాటు చేసుకోవాలి.
ఇక మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక రాత్రి పూట ఈ పండ్లను తింటే జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి విరేచనాలు కూడా కావచ్చు. కనుక మామిడి పండ్లను రాత్రి పూట తినరాదు. ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాలి. న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం వీటిని మధ్యాహ్నం లంచ్ తరువాత 2 గంటలు గ్యాప్ ఇచ్చి తినాలి. అప్పుడే ఈ పండ్ల ద్వారా మనకు అనేక లాభాలు కలుగుతాయి.