రోజూ అనుసరించే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా జీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. తప్పు దిశలో నిద్రపోవడం కూడా ఎదుగుదలకు అడ్డంకులు కలిగిస్తుందని చెబుతారు.
చాలా మంది దీనిని పట్టించుకోరు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు నిద్రించే భంగిమ కూడా మీ కర్మలను మార్చగలదు.
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయం, కర్మకు అధిపతిగా పేర్కొన్నారు. ఎప్పుడూ కఠినంగా పరీక్షిస్తాడు. వాస్తు , జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దక్షిణ దిశలో తల పెట్టి నిద్రించడం వల్ల వ్యక్తి శక్తి నేరుగా శనితో అనుసంధానించి ఉంటుందట.
శనికి ఏ దిశ ఇష్టం?
దక్షిణ దిశలో నిద్రించడం వల్ల శని శక్తి మీ మూలాధార చక్రాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది.
మీకు ఎటువంటి ప్రతికూల కలలు రావు.
మానసిక శాంతి, క్రమశిక్షణ మరియు వృత్తిపరమైన స్పష్టత పెరుగుతుంది.
శని దోషాల దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు అంతర్గత పరిపక్వత మేల్కొంటాయి.
ప్రతిరోజూ నిద్రపోయే ముందు ‘ఓం శం శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
మెటల్ బెడ్ పై నిద్రపోవద్దు..చెక్క మంచాన్ని ఉపయోగించండి
ఉత్తరం లేదా పడమర దిశలో తల పెట్టి నిద్రించకూడదు
గ్రహాల ప్రకారం …
ఒక్కో దిశకు ఒక్కో అధిపతి ఉంటాడు.. వారినే అష్టదిక్పాలకులు అని పిలుస్తారు. తూర్పు దిశకు ఇంద్రుడు, ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. అందుకే ఈ దిశల వైపు తలపెట్టి నిద్రపోకూడదు.. మిగిలిన రెండు దిశలవైపు తలపెట్టి నిద్రపోవచ్చు. లేస్తూ తూర్పు దిశ, ఉత్తర దిశను చూసి నమస్కరించాలని చెబుతారు పెద్దలు. దక్షిణ దిశకు యముడు అధిపతి..అందుకే నిద్రలేచేటప్పుడు ఆ దిశను చూస్తూ లేవకూడదు. అంటే ఉత్తరం దిశగా తలపెట్టి నిద్రపోకూడదని చెబుతారు. చనిపోయిన వారిని ఉత్తరంవైపు తలపెట్టి పడుకోబెడతారు.
సైన్స్ ప్రకారం
మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వల్ల అయస్కాంత తరంగాలు ఉత్తరం వైపు నుంచి పడమర మీదుగా దక్షిణం దిశగా ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులో శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దీంతో అనారోగ్య, మానసిక సమస్యలు వస్తాయి..రక్తప్రసరణలో మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఉండేవారు ఈ దిశగా నిద్రిస్తే ప్రమాదం ఉండదు కానీ ఇప్పటికే అనారోగ్యంతో ఉండేవారు ఈ దిశగా నిద్రిస్తే ఆందోళన పెరుగుతుందట. మరీ ముఖ్యంగా ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తే తలనొప్పి, గందరగోళం, మెదడులో చురుకుదనం తగ్గడం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. సమాచారాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించడం మంచిది.



































