గతంలో పలు సూపర్ హిట్ ల్లో హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కానీ దీని తర్వాత మరో లో నటించలేదామె. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా మారిపోయింది. మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ప్రత్యేక కార్యక్రమాలు, క్యాంపెయిన్లు కూడా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది రేణూ దేశాయ్. ల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దైవభక్తి ఎక్కువగా ఉన్న ఈ అందాల తార తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ను షేర్ చేసింది.
కాశీలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ‘ఈ రోజు కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు.. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమశివుడు పిలిచిప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీ వెళ్తారు’ అంటూ తన ఫొటోలకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇదే..
కాగా రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ తెరంగేట్రం నుంచి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ లో అకీరా కూడా ఓ పాత్రలో కనిపించనున్నాడని వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. అయితే త్వరలోనే ఈ స్టార్ కిడ్ ల్లోకి ఎంట్రీ ఇవ్వచ్చునని తెలుస్తోంది. దీనిపై రేణూ దేశాయ్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడింది. అకీరాకు ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా ల్లోకి వస్తాడని చెప్పుకొచ్చింది. దీంతో అకీరా ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



































