నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రభావంతో ఈనెల 24, 25, 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపిఎస్డిఎంఏ సూచించింది.
































