మరో సారి బ్యాంకుల విలీనానికి రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. ఈ సారి భారీ స్థాయిలో విలీనం దిశగా కార్యాచరణ ఖరారు చేస్తన్నారు.
ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసారు. ఎస్సీఐ గ్రూపు మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. చిన్న స్థాయిలో ఉన్న బ్యాంకులను పెద్ద వాటిలో కలిపేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకు 2027 మార్చి 31ని డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
కేంద్రం మరోసారి బ్యాంకుల విలీనం దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇక ఆంధ్రా, కార్పొరేషన్, దేనా, విజయా, ఓబీసీ, యూబీఐ, సిండికేట్, అలహాబాద్ వంటి ఇంకొన్ని బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, ఇండియన్ బ్యాంకుల్లోకి చేర్చింది. అలాగే ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు విలీనం దిశగా ఆ బ్యాంకుల ఆర్దిక లావాదేవీలు.. సిబ్బంది.. విలీనం ప్రతపాదనల పైన కేంద్రంలోని ఉన్నత స్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం)లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఎస్బీఐల్లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ స్థాయి సీనియర్ అధికారులు చర్చించి, ఆ తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్నస్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసింది. ఇక ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటాను ఉపసంహరించుకోవడంతో ఆ వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొనుగోలు చేసింది.